వేంకటేశుని ఆశీస్సులతో నిర్విఘ్నంగా ఓం నమో వేంకటేశాయ..!

  • IndiaGlitz, [Friday,September 23 2016]

న‌వ‌ర‌స స‌మ్రాట్ నాగార్జున - ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావు కాంబినేష‌న్లో రూపొందుతున్న భ‌క్తిర‌స చిత్రం ఓం న‌మో వేంక‌టేశాయ‌. ఈ చిత్రాన్ని సాయికృపా ఎంట‌ర్ టైన్మెంట్స్ ప్రై లిమిటెడ్ బ్యాన‌ర్ పై మ‌హేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. వెంక‌టేశ్వ‌ర‌స్వామి భ‌క్తుడు హ‌థీరామ్ బాబా జీవిత క‌థ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
ఈ చిత్రంలో వేంకటేశ్వరస్వామిగా సౌరబ్‌జైన్‌ నటిస్తుండగా, హ‌ధీరామ్ బాబాగా నాగార్జున న‌టిస్తున్నారు. అందాల తార‌లు అనుష్క‌, ప్ర‌గ్యా జైస్వాల్ ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్నారు. హైద‌రాబాద్ లో వ‌ర్షాలు ప‌డుతున్న‌ప్ప‌టికీ ఆ వేంక‌టేశుని ఆశీస్సుల‌తో ఎలాంటి ఆటంకం లేకుండా ఓం న‌మో వేంక‌టేశాయ షూటింగ్ జ‌రుగుతుంది. ఈ సంద‌ర్భంగా ఓం న‌మో వేంక‌టేశాయ టీమ్ త‌మ ఆనందాన్ని తెలియ‌చేస్తూ...వ‌ర్కింగ్ స్టిల్స్ రిలీజ్ చేసారు. నాగార్జున త‌మ షూటింగ్ కి ఎలాంటి ఆటంకం క‌లిగించ‌నందుకు సంతోషం వ్య‌క్తం చేస్తూ ఆ శ్రీనివాసుడుకి ధ‌న్య‌వాదాలు తెలియ‌చేస్తున్న‌ట్టుగా ఉన్న స్టిల్స్ రిలీజ్ చేయ‌డం విశేషం. శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఓం న‌మో వేంక‌టేశాయ చిత్రాన్ని సంక్రాంతి కానుక‌గా రిలీజ్ చేయాల‌నుకుంటున్నారు..!

More News

మహేష్ దూకుడుకు ఐదేళ్లు..!

సూపర్ స్టార్ మహేష్ బాబు - శ్రీను వైట్ల కాంబినేషన్లో రూపొందిన సంచలన చిత్రం దూకుడు.ఈ చిత్రాన్ని 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్

బోయపాటి శ్రీను - బెల్లంకొండ సాయిశ్రీనివాస్ సినిమా ప్రారంభం..!

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ తో సరైనోడు సినిమాని తెరకెక్కించి ఘన విజయాన్ని సొంతం చేసుకున్న సక్సెస్ ఫుల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను

మ‌జ్నులో అలా చేయ‌డం నాకు కిక్ ఇచ్చింది - నాని

భ‌లేభలేమ‌గాడివోయ్,కృష్ణగాడివీరప్రేమగాధ‌,జెంటిల్మ న్...చిత్రాల‌తో హ్యాట్రిక్సా ధించిన యువ హీరో నాని. విభిన్న క‌థా చిత్రాల‌ను ఎంచుకుంటూ వ‌రుస విజ‌యాలు సాధిస్తున్న నాని తాజా చిత్రం మ‌జ్ను.

మెగాస్టార్ 38 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ ఇక్క‌డ‌..!

తెలుగు సినీ ప్ర‌పంచంలో పునాదిరాళ్లు సినిమాతో ప్ర‌వేశించి... చిరు పాత్ర‌లు పోషించే స్ధాయి నుంచి చిరంజీవిగా ప్రేక్ష‌క హృద‌యాల్లో సుస్ధిర స్ధానం సంపాదించుకున్నారు

ఎమ్‌.ఎమ్‌. మూవీ మేకర్స్‌ బ్యానర్‌లో ఓషో తులసీరామ్‌ నూతన చిత్రం

మంత్ర, మంగళ చిత్రాలతో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు ఓషో తులసీరామ్‌. త్వరలో ఓ విభిన్న చిత్రాన్ని తెర‌కెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ చిత్రాన్ని ఎమ్‌.ఎమ్‌. మూవీ మేకర్స్  సంస్థ నిర్మించ‌నుంది.