ఓం నమో వేంకటేశాయ ఆడియో వేదిక ఖరారు..!

  • IndiaGlitz, [Friday,December 30 2016]

న‌వ‌ర‌స స‌మ్రాట్ నాగార్జున, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో రూపొందుతున్న నాలుగ‌వ భ‌క్తిర‌స చిత్రం ఓం నమో వేంక‌టేశాయ‌. ఈ చిత్రాన్ని సాయికృపా ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకం పై ఎ.మహేష్‌రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన ఫస్ట్‌ లుక్‌కి, మోషన్‌ పోస్టర్ & టీజ‌ర్ కు అనూహ్య‌మైన స్పంద‌న‌ ల‌భించింది.
ఇక స్వ‌ర‌వాణి కీర‌వాణి సంగీతం అందించిన ఆడియోను జ‌నవ‌రి 8న రిలీజ్ చేయ‌నున్న విష‌యం తెలిసిందే. ఆడియో వేడుక‌ను తిరుప‌తిలో చేస్తారేమో అనుకున్నారు. అయితే...తాజా స‌మాచారం ప్ర‌కారం జ‌న‌వ‌రి 8న హైద‌రాబాద్ లోని హైటెక్స్ లో ఘ‌నంగా ఆడియో వేడుక నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు చేస్తున్నార‌ని తెలిసింది. ఈ అథ్యాత్మిక అద్భుతం ఓం న‌మో వేంక‌టేశాయ చిత్రాన్ని ఫిబ్ర‌వ‌రి 10న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ చేయ‌నున్నారు.

More News

ఖైదీ నెం150 సెన్సార్ కంప్లీట్..!

మెగాస్టార్ చిరంజీవి నటించిన 150వ చిత్రం ఖైదీ నెం 150.

ఫుల్ లెంగ్త్ ఎంటర్ టైనర్ 'ఇంట్లో దెయ్యం నాకేం భయం' అందర్నీ ధ్రిల్ చేస్తుంది - నటకిరీటి డా.రాజేంద్రప్రసాద్

నటుడుగా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి 'జులాయి','సన్నాఫ్ సత్యమూర్తి','శ్రీమంతుడు','నాన్నకు ప్రేమతో',

వంశీ పైడిప‌ల్లి పై ప్రొడ్యూస‌ర్స్ కౌన్సిల్ కి ఫిర్యాదు చేసిన పివిపి..!

డైరెక్ట‌ర్ వంశీ పైడిప‌ల్లి  పివిపి బ్యాన‌ర్ లో ఊపిరి సినిమా చేసారు. ఆత‌ర్వాత ఇదే బ్యాన‌ర్ లో వంశీ పైడిప‌ల్లి  మ‌హేష్ బాబు హీరోగా ఓ సినిమా చేయ‌డానికి అంగీక‌రించారు.

ఖైదీ నెం 150 రిలీజ్ డేట్ & టార్గెట్ ఫిక్స్..!

మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న ఖైదీ నెం 150 చిత్రం సంక్రాంతికి ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతుంది. జ‌న‌వ‌రి 1న సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేయ‌నున్నారు.

సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ఖైదీ నెం.150 ఆడియో..!

ఆడియో రంగంలో ఎన్నో సంచలనాలు సృష్టించి మరెన్నో సూపర్హిట్ ఆల్బమ్స్ని అందించిన సంస్థగా పేరు తెచ్చుకున్న లహరి మ్యూజిక్ మళ్ళీ వరుసగా సూపర్ డూపర్హిట్ ఆడియోలను ప్రేక్షకులకు అందిస్తూ విజయపథంలో దూసుకెళ్తున్న ఈ సంస్థ తాజాగా మెగాస్టార్ చిరంజీవి ప్రెస్టీజియస్ మూవీ 'ఖైదీ నెం.150' చిత్రం ఆడియోను విడుదల చేసింది.