వృద్ధాప్యం మనసుకు కాదు
Send us your feedback to audioarticles@vaarta.com
ఇండియన్ సినిమాల్లో బయోపిక్స్ ట్రెండ్ ఇంకా తగ్గలేదు. క్రీడా రంగానికి సంబంధించి మరో బయోపిక్ `సాండ్ కీ అంఖ్`త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. చంద్రో, ప్రకాశీ తోమర్ అనే లేడీ షార్ప్ షూటర్స్ జీవితాల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఉత్తర ప్రదేశ్‌కి చెందిన షూటర్ దాదీస్‌గా తాప్సీ, భూమి పెడ్నేకర్ నటిస్తున్నారు.ఈ సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ పోస్టర్‌ను విడుదల చేశారు. టైటిల్ పోస్టర్‌పై `వృద్ధాప్యం శరీరానికే .. మనసుకు కాదు` అనేది ట్యాగ్ లైన్. తుషార హీరానందని దర్శకత్వంలో అనురాగ్ కశ్యప్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సినిమా షూటింగ్ సమయంలో ఈ షూటర్ దాదీస్‌ను తాప్సీ, భూమి ప్రత్యేకంగా కలుసుకుని వివరాలను తెలుసుకుని నటించడం విశేషం. చిత్రీకరణంతా బాగ్‌పట్‌లోనే జరిగింది. దీపావళికి సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com
Comments