ఒక్కడు మిగిలాడు రిలీజ్ వాయిదా

  • IndiaGlitz, [Tuesday,September 05 2017]

మంచు మనోజ్ ద్విపాత్రాభినయం చేస్తున్న చిత్రం ఒక్కడు మిగిలాడు. పద్మజ ఫిల్మ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి అజయ్ ఆండ్రూస్ నూతక్కి దర్శకుడు. నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా కొనసాగుతున్నాయి. కంప్యూటర్ గ్రాఫిక్స్ పనులు ఎక్కువగా ఉన్నందున కొంత మేరకు జాప్యం జరుగుతున్నట్టు నిర్మాతలు ఎస్ ఎన్ రెడ్డి, ఎన్ లక్ష్మీకాంత్ తెలిపారు. 25 నిమిషాల పాటు జరిగే యుద్ధ సన్నివేశాలతో పాటు 35 నిమిషాలు సముద్రంలో సాగే ప్రయాణం ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని చెప్పారు.

వీటిని దర్శకుడు అజయ్ అధ్బుతంగా చిత్రీకరించారని తెలిపారు. చిత్రం విడుదల తేదీని వారం రోజుల్లో ప్రకటిస్తామన్నారు. మనోజ్ నటన ఇది వరకు ఎప్పుడు చూడని విధంగా చాలా అద్భుతంగా నిలుస్తుందని నిర్మాతలు చెప్పారు. ఈ చిత్రం లో మనోజ్ సరసన అనీషా అంబ్రోస్ నటించగా అజయ్, జెన్నిఫర్, మురళీమోహన్, సుహాసిని, బెనర్జీ, మిలింద్ గునాజి ఇతర నటీనటులు. ఈ చిత్రానికి శివ నందిగాం సంగీతం అందించగా వి కే రామరాజు సినిమాటోగ్రఫీ, పి ఎస్ వర్మ ఆర్ట్.