బాబాయ్‌కు ప్రేమతో.. ‘ఒక్కడొచ్చాడు’!
Send us your feedback to audioarticles@vaarta.com
ఎన్నికల సీజన్ వచ్చిందంటే చాలు పరిస్థితులు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అప్పటి వరకూ ఓ లెక్క.. ఎన్నికల ముందు రెండు మూడు నెలలు ఓ లెక్క. ఏ చిన్న అవకాశం వచ్చినా సరే వదులుకోకుండా దాన్ని సువర్ణావకాశంగా మలుచుకుని అటు అధికార పార్టీ.. ఇటు ప్రత్యర్థి పార్టీలు పెద్ద హంగామానే చేస్తుంటాయి. మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో అయితే నెటిజన్ల హడావుడి ఇక మాటల్లో చెప్పలేం.. ఇక ప్రచారాలకు పాటలు, స్పీచ్‌లు అయితే ఇరుగదీసుడే. ఇక జనసేన విషయానికొస్తే.. అధికార, ప్రతిపక్ష పార్టీలను సైతం ఢీ కొడానని.. కచ్చితంగా ‘కింగ్ మేకర్’ తానే అంటూ ధీమాతో పవన్ కల్యాణ్ ముందుకెళ్తున్నారు. ఈ తరుణంలో పవన్ ఫ్యామిలీ నుంచి మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ బాబాయ్ కోసం.. పార్టీ కోసం తాను ఏం చేయడానికైనా సిద్ధమేనని ప్రకటించిన సంగతి తెలిసిందే.
అయితే తాజాగా ‘బాబాయ్‌కు ప్రేమతో’ చరణ్..‘ ఒకడొచ్చాడు వచ్చాడు.. జాతిని జాగృతిగొలుప.. వచ్చాడు వచ్చాడు.. కులము మతములదెంప..’ అనే పాటను తన ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. ‘69వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ పాటను దేశం కోసం పోరాడిన హీరోలకు అంకితం చేస్తున్నాను. నా దృష్టిలో, లక్షలాది అభిమానుల దృష్టిలో, అంతకన్నా ఎక్కువ ఉండే జన సైనికుల దృష్టిలో బాబాయి ఎలా ఉంటాడో చెప్పే ఓ పాట ఇది.. దీన్ని విని స్ఫూర్తి పొందండి. జై హింద్’ అని చరణ్ ఫేస్బుక్లో పోస్ట్ చేయడం విశేషం.
కాగా.. ఇకపై ఈ సాంగ్‌ను అటు జనసైనికులు, పవన్ కల్యాణ్ ప్రచార సాధనాలుగా ఉపయోగించబోతున్నారన్న మాట. ఈ ‘ఒకడొచ్చాడు.. వచ్చాడు’ అంటూ సాగిన సాంగ్‌ను వరికుప్పాల యాదగిరి పాడగా.. ఆయనే మ్యూజిక్ కంపోజ్ చేశారు. ఆర్. ఎ (అంజిబాబు) లిరిక్స్ అందించారు. ఇక విజువల్గానూ ఈ సాంగ్ జనసైనికుల్లో ఉత్సాహం నింపేదిగా ఉంది. ఇప్పటికే ఈ పాటకు 1,55, 839 వ్యూస్ రావడం గమనార్హం. మరోవైపు అంతేరీతిలో కామెంట్స్ కూడా వచ్చాయి.
అయితే.. రాంచరణ్ దగ్గరుండి ఈ పాట కంపోజ్ చేయించినట్లు స్పష్టంగా అర్థమవుతోంది. మొత్తానికి బాబాయ్‌కు ప్రేమతో.. అబ్బాయ్ ఈ పాటను అంకితమిచ్చేశారు. ఇక పవన్ నుంచి ఎలాంటి రియాక్షన్ ఉంటుందో..? అని అటు జనసైనికులు, కార్యకర్తలు.. ఇటు మెగాభిమానులు వేయి కళ్లతో వేచి చూస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com
Comments