విశాల్‌, తమన్నా జంటగా జి.హరి నిర్మిస్తున్న భారీ చిత్రం ఒక్కడొచ్చాడు

  • IndiaGlitz, [Saturday,August 13 2016]

మాస్‌ హీరో విశాల్‌ కథానాయకుడిగా ఎం.పురుషోత్తమ్‌ సమర్పణలో హరి వెంకటేశ్వర పిక్చర్స్‌ బ్యానర్‌పై యువ నిర్మాత జి.హరి నిర్మిస్తున్న భారీ చిత్రానికి ఒక్కడొచ్చాడు టైటిల్‌ కన్‌ఫర్మ్‌ చేశారు. ఈ చిత్రం కోసం ఫైట్‌ మాస్టర్‌ కనల్‌కణ్ణన్‌ సారథ్యంలో భారీ ఎత్తున కోటిన్నర రూపాయల వ్యయంతో ఓ ఛేజ్‌ని చిత్రీకరించారు. శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్ర విశేషాల‌ను నిర్మాత జి.హ‌రి తెలియ‌చేస్తూ... పాండిచ్చేరిలో భారీ సెట్స్‌ వేసి దినేష్‌ నృత్యదర్శకత్వంలో హీరో విశాల్‌ ఇంట్రడక్షన్‌ సాంగ్‌ని చాలా లావిష్‌గా చిత్రీకరించాం. అలాగే విశాల్‌, తమన్నాలపై శోభి నృత్య దర్శకత్వంలో భారీ సెట్స్‌లో కోటి రూపాయల వ్యయంతో ఓ పాట తీశాం.

హిప్‌ ఆప్ త‌మిళ సంగీతం అందించిన మరో బిగ్గెస్ట్‌ మ్యూజికల్‌ హిట్ గా ఒక్కడొచ్చాడు నిలుస్తుంది. యాక్షన్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌, మ్యూజిక్‌ అన్నీ మిక్స్‌ అయిన మంచి కమర్షియల్‌ ఫిలిం ఒక్కడొచ్చాడు. విశాల్‌ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌ సినిమా ఇది. సెప్టెంబర్‌లో 10 రోజుల టాకీ పార్ట్‌ చెయ్యడంతో షూటింగ్‌ పూర్తవుతుంది. రష్యాలో రెండు పాటల్ని చిత్రీకరిస్తాం. ఆగస్ట్‌ 19న ఫస్ట్‌ లుక్‌. ఆగస్ట్‌ 29 విశాల్‌ బర్త్‌డే సందర్భంగా టీజర్‌ రిలీజ్‌ చేస్తాం. అక్టోబర్‌ 9న ఆడియో, అక్టోబర్‌ 29న వరల్డ్‌వైడ్‌గా సినిమా రిలీజ్‌కి ప్లాన్‌ చేస్తున్నాం అన్నారు.

విశాల్‌, తమన్నా జంటగా నటిస్తున్న ఈ భారీ చిత్రంలో ప్రైమ్‌స్టార్‌ జగపతిబాబు విలన్‌గా నటిస్తున్నారు. సంపత్‌రాజ్‌, చరణ్‌, జయప్రకాష్‌ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: హిప్‌హాప్‌ తమిళ, సినిమాటోగ్రఫీ: రిచర్డ్‌ ఎం.నాథన్‌(రంగం ఫేమ్‌), మాటలు: రాజేష్‌ ఎ.మూర్తి, పాటలు: డా. చ‌ల్లా భాగ్యలక్ష్మి, ఎడిటింగ్‌: ఆర్‌.కె.సెల్వ, డాన్స్‌: దినేష్‌, శోభి, సహనిర్మాత: ఇ.కె.ప్రకాష్‌, సమర్పణ: ఎం.పురుషోత్తమ్‌, నిర్మాత: జి.హరి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సురాజ్‌.

More News

ఆలోచింప చేస్తున్న గ్యారేజ్ డైలాగ్స్

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ - కొర‌టాల శివ కాంబినేష‌న్ లో రూపొందుతున్న భారీ చిత్రం జ‌న‌తా గ్యారేజ్. ఈ చిత్రం సెప్టెంబ‌ర్ 2న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంది.

ఫ‌స్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న న‌వీన్‌చంద్ర చిత్రం

అధినేత', 'ఏమైంది ఈవేళ', 'బెంగాల్‌టైగర్‌'వంటి సూపర్‌హిట్‌ చిత్రాల్ని నిర్మించిన శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ అధినేత కె.కె. రాధామోహన్‌ 'ఓ చినదాన', 'ఒట్టేసిచెబుతున్నా', 'తిరుమల తిరుపతి వెంకటేశ', 'ఏవండోయ్‌ శ్రీవారు', 'యముడికి మొగుడు', 'బెట్టింగ్‌ బంగార్రాజు' వంటి సూపర్‌హిట్‌ చిత్రాలకు దర్శకత్వం వహించిన ఇ.సత్తిబాబు దర్శకత్వంలో నిర్మిస్తున్న పూర్త&

ల‌క్ష్మి బాంబ్ కోసం మంచు మ‌నోజ్ ఫైట్స్

మంచు లక్ష్మీ ప్రసన్న టైటిల్‌పాత్రలో గునపాటి సురేష్‌ రెడ్డి సమర్పణలో ఉద్భవ్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై కార్తికేయ గోపాలకృష్ణ దర్శకత్వంలో వేళ్ల మౌనిక చంద్రశేఖర్‌, ఉమా లక్ష్మీ నరసింహ నిర్మాతలుగా రూపొందుతోన్న చిత్రం 'లక్ష్మీబాంబ్‌

'జ‌న‌తాగ్యారేజ్'ఆల‌స్యం అవుతుందా?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, కొర‌టాల శివ కాంబినేష‌న్ రూపొందుతోన్న చిత్రం ‘జ‌న‌తాగ్యారేజ్’. సినిమా ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతుంది. మిర్చి, శ్రీమంతుడు చిత్రాలు త‌ర్వాత ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ తెర‌కెక్కిస్తున్న మూడో చిత్ర‌మిది.

డ‌బ్బింగ్ కార్య‌క్ర‌మాల్లో గోపీచంద్ 'ఆక్సిజన్'

ఎగ్రెసివ్‌ హీరో గోపీచంద్‌ కథానాయకుడిగా ఎ.ఎం.జోతికృష్ణ దర్శకత్వంలో శ్రీసాయిరాం క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌.ఐశ్వర్య నిర్మిస్తున్నచిత్రం 'ఆక్సిజన్‌. ప్ర‌స్తుతం ఈ సినిమా డ‌బ్బింగ్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటుంది.