'ఒక్క క్ష‌ణం' వాయిదా ప‌డ‌నుందా?

  • IndiaGlitz, [Monday,November 27 2017]

సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఇప్పటికే ఈ ఏడాదిలో ఐదు సినిమాలను విడుదల చేసారు. ఇప్పుడు డబుల్ హ్యాట్రిక్ సినిమాగా నాని నటించిన 'ఎం.సి.ఎ.' కూడా రిలీజ్ కి సిద్దంగా ఉంది. అయితే ఈ సినిమాను డిసెంబర్ 21న రిలీజ్ చేయాలని నిశ్చయించారు.

కాని డిసెంబర్ 22న అఖిల్ హీరోగా 'హలో' సినిమా విడుదల కానుండడంతో.. 'ఎం.సి.ఎ.' మూవీని డిసెంబర్ 15న రిలీజ్ చేయడానికి సిద్దమయ్యారు. కాకపోతే సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు డిసెంబర్ మొదటి వారం వరకు ఉండడంతో.. 15వ తేదీన రిలీజ్ కు సమ్మతంగా లేరు. అయితే ముందనుకున్నట్టుగానే..21న 'ఎం.సి.ఎ.'ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తే క్రిస్మస్ సెలవులను క్యాష్ చేసుకోవచ్చన్న ఆలోచనతో దిల్ రాజు ఉన్నట్టు సమాచారం.

ఇప్పుడు ఇదే గ‌నుక‌ జరిగితే 21న రాబోతున్న 'ఎం.సి.ఎ.', 22న వస్తున్న'హలో' సినిమాలతో థియేటర్లు బ్లాక్ అయిపోవచ్చు. అప్పుడు 23న రాబోతున్న 'ఒక్క క్షణం'కి థియేటర్లు దొరకకపోవచ్చు. ఈ సందిగ్ధంలో 'ఒక్క క్షణం' నిర్మాతలు తమ సినిమాని వాయిదా వేసేలా కనిపిస్తున్నారు. ఏదేమైనా.. దిల్ రాజు 'ఎం.సి.ఎ.' రిలీజ్ విషయంలో క్లారిటీ ఇచ్చే వరకు.. 'ఒక్క క్షణం' నిర్మాతలు వేచి ఉండక తప్పదు.