డిసెంబర్ 28న 'ఒక్క క్షణం' ?

  • IndiaGlitz, [Saturday,December 02 2017]

అల్లు శిరీష్ హీరోగా తెరకెక్కిన చిత్రం ఒక్క క్షణం'. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ఎక్కడికి పోతావు చిన్నవాడా' డైరెక్టర్ వి.ఐ.ఆనంద్ రూపొందించిన ఈ సినిమా మంచి కథా కథనంతో ఆసక్తిగా ఉంటుందని వినికిడి.

చక్రి చిగురుపాటి నిర్మాత. అయితే ముందుగా ఈ సినిమాని డిసెంబర్ 23న రిలీజ్ చేస్తున్నామని నిర్మాత ప్రకటించారు. కాని నాని నటించిన 'ఎం.సి.ఎ.', అలాగే అఖిల్ హీరోగా హలో' సినిమాలు వరుసగా డిసెంబరు 21, 22 తేదీల్లో విడుదల అవుతున్నాయి. అందుకే ఈ సినిమాని డిసెంబర్ 28న రిలీజ్ చేయబోతున్నట్లు నిర్మాతలు ప్రకటించారు.

ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ ప్రీ-రిలీజ్ బిజినెస్ బాగా జరిగింది. ఈ సినిమాని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నామని నిర్మాతలు తెలియచేసారు. సురభి హీరోయిన్‌గా నటించిన చిత్రంలో అవ‌స‌రాల శ్రీ‌నివాస్‌, సీర‌త్ క‌పూర్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. మెలోడీ బ్ర‌హ్మ మణిశర్మ బాణీలు అందించారు.

More News

శ్రీపతి కర్రి దర్శకత్వంలో వస్తున్న'హల్ చల్' ఫస్ట్ లుక్ విడుదల

శ్రీ రాఘవేంద్ర ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై శ్రీపతి కర్రి దర్శకత్వంలో గణేష్ కొల్లూరి నిర్మిస్తున్న చిత్రం హల్ చల్. రద్రాక్ష్ ఉత్కమ్, ధన్యా బాలకృష్ణ జంటగా నటిస్తున్నారు.

డ‌బ్బింగ్ చెప్పుకుంటోన్న బాల‌య్య హీరోయిన్‌...

ఇప్పుడు తారామ‌ణులంద‌రూ సొంత గొంతుక‌తో డ‌బ్బింగ్ చెప్పుకోవ‌డానికి ఆస‌క్తిని క‌న‌ప‌రుస్తున్నారు. రాశిఖ‌న్నాలాంటి కొంద‌రు హీరోయిన్స్ అయితే ఏకంగా పాట‌లు కూడా పాడేస్తున్నారు.

హ‌లో' ట్రైల‌ర్ రివ్యూ...

అక్కినేని అఖిల్ హీరోగా అన్న‌పూర్ణ స్టూడియోస్‌, మ‌నం ఎంట‌ర్‌టైన్మెంట్స్ ప‌తాకంపై నిర్మిత‌మవుతున్న చిత్రం 'హ‌లో'. క‌ల్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ సినిమాకు విక్ర‌మ్ కె.కుమార్ ద‌ర్శ‌కుడు.

సప్తగిరి జర్నీ చాలా చాలా బాగుంది - సుకుమార్‌

'సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌' వంటి సూపర్‌హిట్‌ చిత్రం తర్వాత సప్తగిరి హీరోగా నటిస్తోన్న ద్వితీయ చిత్రం 'సప్తగిరి ఎల్‌.ఎల్‌.బి'. హిందీలో సూపర్‌డూపర్‌ హిట్‌గా నిలిచిన 'జాలీ ఎల్‌.ఎల్‌.బి'కి రీమేక్‌ ఇది.

మెంటల్ మదిలో సక్సెస్ సెలెబ్రేషన్స్

ధ‌ర్మ‌ప‌థ క్రియేష‌న్స్ ప‌తాకంపై రూపొందిన చిత్రం 'మెంట‌ల్ మ‌దిలో'. రాజ్ కందుకూరి నిర్మాత‌. వివేక్ ఆత్రేయ ద‌ర్శ‌కుడు. డి.సురేశ్‌బాబు స‌మర్పిస్తున్నారు. శ్రీవిష్ణు, నివేథా పెతురాజ్ జంట‌గా నటించిన  ఈ సినిమా న‌వంబ‌ర్ 24న విడుదలైన ఈ చిత్రం నేటికీ మంచి స్పందనతో పాటు కలెక్షన్స్ తో దూసుకెళుతోంది.