'ఒక్క క్షణం' ఆ సినిమాకి కాపీ వెర్షనా?
Send us your feedback to audioarticles@vaarta.com
అల్లు శిరీష్, సురభి, అవసరాల శ్రీనివాస్, సీరత్ కపూర్ ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం `ఒక్క క్షణం`. `ఎక్కడికి పోతావు చిన్నవాడా` చిత్రంతో ఆకట్టుకున్న వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. మణిశర్మ సంగీతమందించారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్‌కి మంచి స్పందన వచ్చింది.
ఇదిలా ఉంటే.. ఈ సినిమా కొరియన్ మూవీ పారలెల్ లైఫ్ ఆధారంగా రూపొందిందని టాలీవుడ్లో కథనాలు వినిపిస్తున్నాయి. ఒక్క క్షణం టీజర్లో చూపినట్లుగానే ఈ కొరియన్ చిత్రంలోనూ ఓ జంట ప్రజెంట్.. ఇంకో జంట ఫ్యూచర్ గా ఉంటుంది. ప్యారలెల్ లైఫ్ విడుదలైన ఏడేళ్ల తరువాత.. తెలుగులో అదే పాయింట్‌తో వస్తున్న `ఒక్క క్షణం`..
ఆ సినిమాని స్ఫూర్తిగా తీసుకుని తెరకెక్కిందో లేదంటే కాపీ వెర్షన్ గా ఉంటుందో తెలియాలంటే డిసెంబర్ 28 వరకు వేచి చూడాల్సిందే. అంతేకాకుండా.. ఇటీవల విడుదల చేసిన ఈ సినిమాలోని పాట సో మెనీ సో మెనీ.. యూట్యూబ్‌లో ఎంతో పాపులర్ అయిన షేప్ ఆఫ్ యు అనే సాంగ్ ట్యూన్‌తోనే ఉందంటూ విమర్శలు వచ్చాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com