'ఒక్క క్షణం' సెన్సార్ పూర్తి
Send us your feedback to audioarticles@vaarta.com
శ్రీరస్తు శుభమస్తు లాంటి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తర్వాత అల్లు శిరీష్ హీరోగా, సురభి జంటగా, ఎక్కడికి పోతావు చిన్నవాడా లాంటి టెర్రిఫిక్ బ్లాక్‌బస్టర్ అందించిన చిత్ర దర్శకుడు విఐ ఆనంద్ దర్శకత్వంలో , క్వాలిటి కోసమే పరితపించే లక్ష్మీ నరసింహ ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మాణ సంస్థ పై చక్రి చిగురుపాటి నిర్మించిన చిత్రం ఒక్క క్షణం.
శ్రీనివాస్ అవసరాల, సీరత్ కపూర్ జంటగా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన టీజర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తై యు బై ఏ సర్టిఫికెట్ పొందింది.
సెన్సార్ సభ్యుల నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. చిత్ర యూనిట్ ను సెన్సార్ సభ్యులు ప్రశంసలతో ముంచెత్తడం విశేషం. మెలోడి బ్రహ్మ మణిశర్మ పాటలు ఈ చిత్రానికి స్పెషల్ ఎట్రాక్షన్ కానున్నాయి. డిసెంబర్ 28న ప్రపంచవ్యాప్తంగా ఒక్క క్షణం విడుదల కానుంది.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.... అల్లు శిరీష్ హీరోగా, సురభి హీరోయిన్ గా మా బ్యానర్ లో నిర్మిస్తున్న చిత్రం ఒక్క క్షణం. మేము విడుదల చేసిన టైటిల్ పోస్టర్ నుంచి టీజర్, సాంగ్ వరకూ అన్నింటికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం రెండు పార్లల్ లైఫ్ లతో ముడిపడి వుంటుంది.
ఒకరి ప్రెజెంట్ మరోకరి ఫ్యూచర్ అనే కాన్సెప్ట్ తో వి ఐ ఆనంద్ చాలా అద్బుతంగా తెరకెక్కించారు. సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకొని యు బై ఏ సర్టిఫికెట్ పొందింది. సెన్సార్ సభ్యుల నుంచి మంచి ప్రశంసలు దక్కాయి. డిసెంబర్ 28 న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నాం.
శ్రీరస్తు శుభమస్తు వంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత అల్లు శిరీష్ నటిస్తున్న చిత్రం కావడం, ఎక్కడికి పోతావు చిన్నవాడ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత విఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అబ్బూరి రవి, ఛోటా కె ప్రసాద్, శ్యామ్ కె నాయుడు వంటి సీనియర్ టెక్నీషియన్స్ ఈ చిత్రానికి వర్క్ చేస్తుండడం విశేషం. అని అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments