ఒక్క అమ్మాయి తప్ప సెన్సార్ పూర్తి
- IndiaGlitz, [Tuesday,May 31 2016]
సందీప్ కిషన్, నిత్యామీనన్ జంటగా నటించిన తాజా చిత్రం ఒక్క అమ్మాయి తప్ప. ఎన్నోవిజయవంతమైన చిత్రాలకు రచయితగా పనిచేసిన రాజసింహ తాడినాడ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అంజిరెడ్డి ప్రొడక్షన్స్ బ్యానర్ పై బోగాది అంజిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి మిక్కి జె.మేయర్ సంగీతం అందించారు.
ఇటీవల రిలీజైన ఒక్క అమ్మాయి తప్ప ఆడియోకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందిన ఒక్క అమ్మాయి తప్ప చిత్రానికి సెన్సార్ బోర్డ్ క్లీన్ యు సర్టిఫికెట్ ఇచ్చింది. సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని జూన్ 10న భారీ స్ధాయిలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అంచనాలకు తగ్గట్టు ఒక్క అమ్మాయి తప్ప సందీప్ కిషన్ కెరీర్ లో ఒక మైలు రాయిలా నిలుస్తుందని ఆశిద్దాం.