'ఒక Sextant కథ' ట్రైలర్ విడుదల

  • IndiaGlitz, [Thursday,October 20 2022]

కెజియఫ్ తాతయ్య కృష్ణోజీ రావు ప్రధాన పాత్రలో కేసరి ఫిలిం కాప్చర్ బ్యానర్ పై కుమార్ ఎల్ దర్శకత్వంలో తెరకెక్కిన లవ్ కామెడీ ఎంటర్ టైనర్ 'ఒక Sextant కథ'. తాజాగా ఈ చిత్రం ట్రైలర్ ని విడుదల చేశారు. ఈ ట్రైలర్ లో 'ఒక Sextant కథ' కథా నేపధ్యాన్ని చూపించారు.

సినీ జూనియర్ ఆర్టిస్ట్‌గా పనిచేసిన నారాయణ అలియాస్ నానో నారాయణ “కేజీఎఫ్” సినిమా తర్వాత చాలా పాపులర్ అవుతాడు. అతని భార్యకు అరుదైన వ్యాధి బారిన పడుతుంది. భార్యకి వచ్చిన వ్యాధిని నయం కావాలంటే 20 లక్షలు కావాలి. అతని దగ్గర విక్టోరియన్ సెక్స్టాంట్ బైనాక్యులర్ అనే యాంటిక్ వస్తువు వుంటుంది. దీని ద్వారా చూస్తే మనుషులు నగ్నంగా కనిపిస్తారు. దినీని అమ్మి డబ్బు సంపాదించి అతని భార్యను ఎలా రక్షించడానేది కథాంశం.

ట్రైలర్ లో కామెడీ, లవ్ , డ్రామా, ఎమోషన్ అన్ని ఎమోషన్స్ వున్నాయి. సినిమాలో మంచి కంటెంట్ వుందని ట్రైలర్ చూస్తుంటే అర్ధమౌతుంది. ట్రైలర్ లో కృష్ణోజీ రావు నటన చాలా సహజంగా ఆకట్టుకుంది. శివ శంకర్ కెమరాపనితనం ఆకట్టుకుంది. అరవ్ రిషిక్ నేపధ్య సంగీతం డీసెంట్ గా వుంది. త్వరలోనే సినిమా విడుదల తేదిని ప్రకటించనున్నారు మేకర్స్.

నటీనటులు: కృష్ణోజీ రావు, ప్రశాంత్ సిద్ది, అపూర్వ, అనంతు పద్మనాభ, శ్యలేష్ , కింగ్ మోహన్ తదితరులు

More News

BiggBoss: బిగ్‌బాస్‌లో ‘‘ఆకలి రాజ్యం’’... శ్రీహాన్‌తో క్లోజ్‌గా ఇనయా, గీతూ-ఆదిరెడ్డిలకు శిక్ష

ఆడియన్స్ ఎక్స్‌పెక్ట్ చేసిన ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వకపోవడంతో కంటెస్టెంట్స్‌పై బిగ్‌బాస్ విరుచుకుపడ్డ సంగతి తెలిసిందే.

చిరంజీవినే అంటాడా ... ప్రొడక్షన్ మేనేజర్‌ని 13 కుట్లు పడేలా కొట్టిన అల్లు అరవింద్, ఏం జరిగిందంటే.?

అల్లు అరవింద్.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వారుండరు. నిర్మాతగా ఎన్నో విజయవంతమైన సినిమాలను ఆయన తెరకెక్కించారు.

దర్శకుడు అనిల్ రావిపూడి చేతుల మీదుగా "స్లమ్ డాగ్ హజ్బెండ్" ఫ్రస్టేషన్ సాంగ్ రిలీజ్

సంజయ్ రావు హీరోగా మైక్ మూవీస్ నిర్మిస్తున్న కామికల్ ఎంటర్ టైనర్ సినిమా "స్లమ్ డాగ్ హజ్బెండ్".

Pawan Kalyan : ఎన్నికలకు ఎలా వెళ్లాలి.. ఒక్క రోజులో తేల్చలేం : చంద్రబాబుతో భేటీ అనంతరం పవన్

రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని బతికించాల్సిన సమయం ఆసన్నమైందని.. ఖూనీ అవుతున్న ప్రజాస్వామ్యాన్ని

Geetha Arts : ‘‘గీత’’ అంటే నా గర్ల్‌ఫ్రెండ్ అనుకుంటున్నారు.. బ్యానర్‌ పేరు వెనుక కథ ఇదే : అల్లు అరవింద్

తెలుగు చలనచిత్ర పరిశ్రమను శాసిస్తోన్న నలుగురిలో ఒకరు అల్లు అరవింద్. ఇక దేశంలోని బడా నిర్మాణ సంస్థల్లో గీతా ఆర్ట్స్ ఒకటి.