ఒక మనసు విజయోత్సవం
Send us your feedback to audioarticles@vaarta.com
మెగా ఫ్యామిలీ నుంచి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన నిహారిక నటించిన తొలి చిత్రం ఒక మనసు. నాగ శౌర్య, నిహారిక జంటగా నటించిన ఒక మనసు చిత్రాన్ని మల్లెలతీరం దర్శకుడు రామరాజు తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని మధుర శ్రీధర్ రెడ్డి నిర్మించారు. స్వచ్ఛమైన ప్రేమకథా చిత్రంగా రూపొందిన ఒక మనసు చిత్రం ఈరోజు (24) రిలీజైంది. మంచి చిత్రంగా ప్రశంసలు అందుకుంటున్న ఒక మనసు విజయాన్ని మెగా ఫ్యాన్స్ హైదరాబాద్ బ్లడ్ బ్యాంక్ లో సెలబ్రేట్ చేసుకున్నారు. వరుణ్ తేజ్, నిహారికకు అభిమానులు అభినందనలు తెలియచేసారు.
ఈ సందర్భంగా వరుణ్ తేజ్ మాట్లాడుతూ...ఒక మనసు చిత్రం చూసాను. నిహారిక ఇంత బాగా నటిస్తుంది అనుకోలేదు. ఒక మనసు ఫ్యామిలీ అందరితో కలిసి చూడాల్సిన సినిమా. నిహారిక మంచి సినిమాలో నటించినందుకు ఆనందంగా ఉంది అన్నారు.
నిహారిక మాట్లాడుతూ..నా మొదటి చిత్రానికి ఇంత మంది అభిమానులు ఉండడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమా అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com