ఒక మనసు డైరెక్టర్ నెక్ట్స్ మాస్ చిత్రం

  • IndiaGlitz, [Tuesday,June 28 2016]

మ‌ల్లెలతీరం చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మై తొలి చిత్రంతోనే అభిరుచిగ‌ల ద‌ర్శ‌కుడిగా మంచి గుర్తింపు ఏర్ప‌రుచుకున్న ద‌ర్శ‌కుడు రామ‌రాజు. తాజాగా నాగ శౌర్య - నిహారిక జంట‌గా రామ‌రాజు ఒక మ‌న‌సు చిత్రాన్ని తెర‌కెక్కించారు. ఈ చిత్రాన్ని మ‌ధుర శ్రీధ‌ర్ రెడ్డి నిర్మించారు. ఇటీవ‌ల రిలీజైన ఈ చిత్రం అంద‌మైన ప్రేమ‌క‌థా చిత్రంగా ప్ర‌శంస‌లు అందుకుంటుంది. ఇదిలా ఉంటే... రామ‌రాజు నెక్ట్స్ మూవీ ని కూడా మ‌ధుర శ్రీధ‌ర్ నిర్మిస్తున్నారు. మ‌ల్లెలతీరం, ఒక మ‌న‌సు...ఇలా క్లాస్ మూవీస్ తెర‌కెక్కించిన రామ‌రాజు నెక్ట్స్ మూవీ కోసం మాస్ క‌థ ఎంచుకోవ‌డం విశేషం. ఈ చిత్రానికి చీక‌టి ప్రేమ‌క‌థ అనే టైటిల్ ప‌రిశీలిస్తున్న‌ట్టు స‌మాచారం. ప్ర‌స్తుతం స్ర్కిప్ట్ వ‌ర్క్ జ‌రుగుతుంది. త్వ‌ర‌లోనే ఈ మూవీని అఫిషియ‌ల్ గా ఎనౌన్స్ చేయ‌నున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు క్లాస్ లవ్ స్టోరీస్ తెర‌కెక్కించిన రామ‌రాజు ఈసారి మాస్ ప్రేమ‌క‌థ‌ను ఎలా డీల్ చేయ‌నున్నారో చూడాలి.