బాలీవుడ్ లో ఓకే బంగారం..
Send us your feedback to audioarticles@vaarta.com
దుల్కర్ సల్మాన్, నిత్యామీనన్ జంటగా మణిరత్నం తెరకెక్కించిన చిత్రం ఓకే కణ్మణి. ఈ చిత్రాన్ని తెలుగులో ఓకే బంగారం టైటిల్ తో రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. దిల్ రాజు తెలుగు ప్రేక్షకులకు అందించిన ఓకే బంగారం ప్రేక్షకులను ఆకట్టుకుంది. చాలా రోజులు నుంచి సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న మణిరత్నంకు ఓకే బంగారం మంచి విజయం అందించింది.
అయితే తెలుగు, తమిళ్ లో విజయం సాధించిన ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయాలనుకున్నారు మణిరత్నం. కానీ..ఎందుకనో ఆ ప్రయత్నాన్నివిరమించుకున్నారు. ఇప్పుడు బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ జోహార్ ఓకే బంగారం చిత్రాన్నిహిందీలో రీమేక్ చేస్తున్నట్టు సమాచారం. ఆదిత్యారాయ్ కపూర్, శ్రద్దా కపూర్ జంటగా నటించే ఈ చిత్రానికి షాద్ ఆలీ దర్శకత్వం వహించనున్నారు. ఈ క్రేజీ మూవీకి ఎ.ఆర్.రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com