రాజు గారి గది చూస్తూ ప్రేక్షకుడు మృతి
Send us your feedback to audioarticles@vaarta.com
ఓంకార్ తెరకెక్కించిన హార్రర్ మూవీ రాజు గారి గది. ఈ చిత్రం దసరాకి రిలీజై విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. అయితే రాజు గారి గది సినిమా చూడడానికి వెళ్లిన ప్రేక్షకులు సినిమా చూస్తూ..థియేటర్లో చనిపోయాడు. ఈ సంఘటన నగరంలోని బహదూర్పురా పరిధిలోని మెట్రో థియేటర్లో జరిగింది. ఈ సినిమాకు వెళ్లిన అమర్నాథం(55) సినిమా చూస్తూ...అక్కడికక్కడే చనిపోయాడు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ విషయాన్ని తెలుసుకున్నరాజు గారి గది డైరెక్టర్ ఓంకార్ చనిపోయిన అమర్ నాథ్ కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments