'ఓ మై గాడ్' ఆడియో విడుదల
- IndiaGlitz, [Friday,November 06 2015]
తనీష్, మేఘశ్రీ, పావని ప్రధానపాత్రల్లో శ్రీ వెంకటేశ్వర విజువల్స్ పతాకంపై వేణు ముక్కపాటి నిర్మించిన చిత్రం 'ఓ మై గాడ్'. వి.శ్రీవాత్సవ్ దర్శకుడు. ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం గురువారం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. డి.ఎస్.రావు ఆడియో సీడీలను ఆవిష్కరించి మొదటి కాపీను శివశక్తిదత్తా కు అందించారు. ఈ సందర్భంగా..
శివశక్తి దత్తా మాట్లాడుతూ.. ''శ్రీవాత్సవ్ నా శిష్యుడు. ఈరోజు తను డైరెక్టర్ గా మారి సినిమాను తెరకెక్కిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా మంచి సక్సెస్ సాధించి డైరెక్టర్ గా శ్రీవాత్సవ్ కు మంచి పేరు రావాలి'' అని చెప్పారు.
డి.ఎస్.రావు మాట్లాడుతూ.. ''చిన్న బడ్జెట్ లో ఓ హారర్ చిత్రాన్ని ఇంత బాగా తీర్చిదిద్దడం గొప్ప విషయం. సినిమా నేను చూసాను. చాలా బావుంది. ప్రస్తుతం హారర్ కామెడీ చిత్రాలు మంచి విజయాన్ని సాధిస్తున్నాయి. ఈ చిత్రం కూడా అదే కోవలోకి రావాలని ఆశిస్తున్నాను'' అని చెప్పారు.
చిత్ర దర్శకుడు శ్రీవాత్సవ్ మాట్లాడుతూ.. ''ఇది నా మొదటి సినిమా. చంద్ర మహేష్ గారు డైరెక్ట్ చేసిన 'హనుమంతు' చిత్రంతో నా కెరీర్ మొదలు పెట్టాను. శివశక్తిదత్తా గారి వద్ద కథను ఎలా సిద్ధం చేయాలో నేర్చుకున్నాను. విజయేంద్ర ప్రసాద్ గారి దగ్గర దర్శకత్వశాఖలో మెళకువలు నేర్చుకున్నాను. ఈ సినిమా బాగా వచ్చింది. ఆర్టిస్టులు అందరు బాగా నటించారు. రాజ్ కిరణ్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.
నిర్మాత వేణు మాట్లాడుతూ.. ''డైరెక్టర్ గారు కథ అవుట్ లైన్ చెప్పగానే సినిమా నిర్మించాలని డిసైడ్ అయ్యాను. ఆర్టిస్ట్స్, టెక్నీషియన్స్ అందరు బాగా సపోర్ట్ చేసారు. మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.
తనీష్ మాట్లాడుతూ.. ''రాజ్ కిరణ్ గారు ఎంతో ఇష్టపడి ఈ సినిమాకు మ్యూజిక్ చేసారు. కథలో భాగంగా పాటలుంటాయి. శ్రీవాత్సవ్ తో ఇంతకముందే సినిమా చేయాలి కాని కుదరలేదు. ఈ సినిమా హారర్ కామెడీ జోనర్ అని చెప్పడం కంటే ఓ సోషియో ఫాంటసీ అని చెప్పొచ్చు. ఇప్పటివరకు తెలుగు ప్రేక్షకులు నన్ను బాగా ఆదరించారు. ఈ చిత్రాన్ని కూడా హిట్ చేయాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.
రాజ్ కిరణ్ మాట్లాడుతూ.. ''నాకు ఈ సినిమాకు మ్యూజిక్ అందించే అవకాసం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. పాటలు విని నన్ను ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేసిన హీరో తనీష్ కు ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ సినిమాలో మొత్తం నాలుగు పాటలుంటాయి'' అని చెప్పారు.
ఇంకా ఈ కార్యక్రమంలో శోభారాణి, చంద్రమహేష్, మధు, సత్తన్న, డి.వి, పావని, మేఘశ్రీ తదితరులు పాల్గొన్నారు.