OG: పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. 'ఓజీ' రిలీజ్ డేట్ అనౌన్స్..

  • IndiaGlitz, [Tuesday,February 06 2024]

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ అభిమానులకు శుభవార్త అందించింది డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్. సాహో డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో పవన్ హీరోగా పాన్ ఇండియా రేంజ్‌లో 'ఓజీ' మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మూవీ నుంచి విడుదలైన పోసర్లు, గ్లింప్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. దీంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఏపీలో ఎన్నికలు సమీపించడంతో పవన్ రాజకీయాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. దీంతో మూవీ షూటింగ్ ఆలస్యమవుతోంది. దీంతో మూవీ విడుదల ఇప్పుడలా ఉంటుందో లేదో అనుమానాల తలెత్తాయి.

అయితే ఆ అనుమానాలకు చెక్ పెడుతూ ఈ మూవీ నుంచి అదిరిపోయే అప్టేడ్ ఇచ్చారు మేకర్స్. ఈ ఏడాది సెప్టెంబర్ 27వ తేదీన మూవీని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ఓ పోస్టర్ విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో పవన్ చాలా స్టైలిష్ లుక్‌లో ఉన్నాడు. బ్లాక్ డ్రెస్‌లో బ్లాక్ కళ్ళజోడు పెట్టుకొని బ్లాక్ కారుకి ఆనుకొని చేతిలో టీ గ్లాస్‌తో నిల్చున్నాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తమ హీరో సూపర్బ్‌గా ఉన్నాడని కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు సెప్టెంబర్ 27వ తేదీని విడుదల చేయనుండటంపై అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఎందుకంటే 2013లో త్రివిక్రమ్ దర్శకత్వంలో ఇదే తేదీన 'అత్తారింటికి దారేది' సినిమా విడుదలైన బ్లాక్‌బాస్టర్‌గా నిలిచింది. అప్పటివరకు ఎక్కవ వసూళ్లు సాధించిన మూవీగా రికార్డ్ సృష్టించింది. దీంతో ఆ తేదీ ఫ్యాన్స్‌కు సెంటిమెంట్‌గా మారింది. ఇప్పుడు మళ్లీ 11 ఏళ్ల తర్వాత అదే తేదీన ‘ఓజీ’ రానుండటంతో ఫ్యాన్స్‌ సంబరపడుతున్నారు. ఈ సినిమా కూడా కాసుల వర్షం కురిపించడం ఖాయమంటున్నారు. ఈ సినిమా ప్రకటన నుంచే అభిమానులతో పాటు ఇండస్ట్రీలో ఆసక్తి నెలకొంది. గతేడాది పవన్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన గ్లింప్స్ అందరి అంచనాలను రెట్టింపు చేసింది. దీంతో మూవీ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

ఇక ఈ సినిమాలో బాలీవుడ్‌ నటుడు ఇమ్రాన్‌ హష్మి విలన్‌గా నటిస్తుండటం విశేషం. అర్జున్‌ దాస్‌, వెంకట్‌, శ్రియారెడ్డి తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇదిలా ఉంటే క్రిష్‌ దర్శకత్వంలో ‘హరిహర వీరమల్లు’, హరీశ్‌ శంకర్‌ దర్శకత్వంలో ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’, సముద్రఖని డైరెక్షన్‌లో ఓ మూవీ, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మరో మూవీతో పవన్ బిజీగా ఉన్నారు. ఎన్నికలు అయిపోగానే ఈ చిత్రాల షూటింగ్స్‌లో పాల్గొననున్నారు. దీంతో వచ్చే రెండు సంవత్సరాలు వరుసగా పవర్ స్టార్ సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి.

More News

Mudragada:టీడీపీ మాజీ ఎంపీతో ముద్రగడ భేటీ.. పొత్తుకు మద్దతు..

ఏపీలో రాజకీయాలు రోజురోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. ఎత్తులు పైఎత్తులతో  పార్టీలు ముందుకెళ్తున్నాయి.

KCR:తెలంగాణ భవన్‌కు వచ్చిన కేసీఆర్.. ఘనస్వాగతం పలికిన శ్రేణులు..

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌కు వచ్చారు. దాదాపు 3 నెలల విరామం తర్వాత ఆయన తెలంగాణ భవన్‌కు

Bharat Rice:రూ.29లకే 'భారత్ రైస్' విక్రయాలు ప్రారంభం.. ఎక్కడ కొనుగోలు చేయాలంటే..?

దేశవ్యాప్తంగా బియ్యం ధరలు పెరిగిన వేళ తక్కువ ధరలకే బియ్యం అందించేలా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Hanuman:'హనుమాన్' మరో రికార్డ్.. 25 రోజుల్లో ఎంత వసూలు చేసిందంటే..?

సంక్రాంతి పండుగ కానుకగా చిన్న సినిమాగా ప్రపంచవ్యాప్తంగా విడుదలైన 'హనుమాన్' చిత్రం రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది.

AP Assembly:హాట్‌హాట్‌గా ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. టీడీపీ సభ్యులు సస్పెన్షన్..

ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు హాట్‌హాట్‌గా సాగాయి. టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియం వద్ద నిరసన తెలపడంతో వారిని సభాపతి తమ్మినేని సీతారాం