నెల్లూరులో కరోనాకు ఆయుర్వేదం మందుపై అధికారుల రిపోర్ట్..
Send us your feedback to audioarticles@vaarta.com
నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకు చెందిన బొనిగి ఆనందయ్య ఆయుర్వేదం మందును ప్రజలకు ఉచితంగా అందజేస్తున్నారు. మొదట పదుల సంఖ్యలో వెళ్లిన జనం.. అనంతరం సత్ఫలితాలు వస్తుండటంతో పెద్ద సంఖ్యలో క్యూ కట్టారు. ఇది తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. మొత్తం మనకు లభ్యమయ్యే సహజ పదార్థాలతోనే ఆయన మందులను తయారు చేసి ప్రజలకు అందిస్తున్నారు. ఇప్పటి వరకూ ఆయన మందులను తీసుకున్న వారెవరూ దాని కారణంగా ఇబ్బంది పడ్డామని చెప్పింది లేదు. అదీ కాక ఆనందయ్య అందిస్తున్న మందును స్వీకరించిన వారిలో ఉన్నతాధికారులు సైతం ఉండటం విశేషం. ఆయన మందు తీసుకున్న అనంతరం ఆక్సిజన్ లెవల్స్ కూడా పెరుగుతుండటం మరో విశేషం.
తెలుగు రాష్ట్రాల్లో బొనిగి ఆనందయ్య ఆయుర్వేదం హాట్ టాపిక్ అవడం జనాలు పెద్ద సంఖ్యలో ఆయన మందు కోసం ఎగబడుతుండటంతో నెల్లూరు జిల్లా ఉన్నతాధికారులు పలువురు అధికారులతో ఒక కమిటీ వేసి నివేదిక కోరారు. ఆ నివేదికను నేడు అధికారులు తమ ఉన్నతాధికారులకు అందజేశారు. నివేదికలో పలు ఆసక్తికర విషయాలను అధికారులు ప్రస్తావించారు. గత నెల 21 నుంచి ఆనందయ్య కొవిడ్ మందును అందజేస్తున్నారని వెల్లడించారు. ఊపిరితిత్తులను శుభ్రం చేయడానికి, కరోనా పాజిటివ్ ఉన్నవారికి, ఆక్సిజన్ తగ్గిన వారికి ఆయుర్వేద మందును ఇస్తున్నారని అధికారులు పేర్కొన్నారు. స్థానికులంతా ఆనందయ్య ఇచ్చే మందు గురించి పాజిటివ్ రిపోర్టు ఇచ్చారని, ఎవ్వరూ కూడా దుష్ఫలితాలొచ్చాయని చెప్పలేదని అధికారులు నివేదికలో పేర్కొన్నారు.
ఆనందయ్య మందు తీసుకున్న వారంతా అనారోగ్యం తగ్గి సంతోషంగా ఇళ్లకు వెళుతున్నారని పేర్కొన్నారు. ఒక్కరంటే ఒక్కరూ కూడా తమకు అనారోగ్యం తగ్గలేదని చెప్పలేదని అధికారులు పేర్కొన్నారు. అయితే ఈ చికిత్సకు అవలంబించే ప్రక్రియ శాస్త్రీయంగా నిరూపితం కావాల్సి ఉందని.. చికిత్స తర్వాత వచ్చే పరిణామాలపై సైతం పరీక్షలు జరగాల్సి ఉందని పేర్కొన్నారు. కానీ నేటి వరకూ సదరు చికిత్సపై ఎలాంటి వ్యతిరేక ఫిర్యాదులు కానీ.. చికిత్స అనంతరం అనారోగ్యానికి గురయ్యామని కానీ ఎవరూ చెప్పలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా ఒక పేషెంట్‌కు ఆక్సిజన్ లెవల్స్ 83 ఉండగా పేషెంట్ కళ్లలో ఆనందయ్య ఇచ్చిన డ్రాప్స్ వేసిన అనంతరం అది 95కు పెరిగిందని అధికారులు నివేదికలో పేర్కొన్నారు. సదరు పేషెంట్‌తో కూడా స్వయంగా మాట్లాడామని వెల్లడించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments