వ్యాక్సిన్ వేయించుకున్నట్టు ఫోటోలకు ఫోజులు.. అడ్డంగా బుక్కయ్యారు..
Send us your feedback to audioarticles@vaarta.com
దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొందరి అతి తెలివి కారణంగా అభాసు పాలవుతోంది. వ్యాక్సిన్ వేసుకోకుండానే వేసుకున్నట్టు నటించి ఫోటోలకు ఫోజులిచ్చారు. అది కాస్తా ఒకరు వీడియో తీయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన కర్నాటక రాష్ట్రంలో జరిగింది. ఆ రాష్ట్రంలోని తుమ్మూరులో ఇటీవలే వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా తొలి రౌండ్ వ్యాక్సిన్‌లను స్థానిక డీఎంవో నాగేంద్రప్ప, ప్రభుత్వ నర్సింగ్ కాలేజీ ప్రిన్స్‌పాల్ రజనీలకు వేయాల్సి ఉంది. అయితే వారు వ్యాక్సిన్ వేయించుకోకుండా ఫోటోలకు, వీడియోలకు మాత్రమే ఫోజులిచ్చారు. వైద్య సిబ్బంది కూడా వారికి టీకా ఇస్తున్నట్టు నటించారు.
కట్ చేస్తే సీన్ రివర్స్ అయింది. వారు తీసుకున్న ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో నెటిజన్లు వీరి ఓవర్ యాక్షన్‌ను ఎండగడుతున్నారు. వైద్యాధికారులకే వ్యాక్సిన్‌పై నమ్మకం లేకుంటే ఇక సామాన్య ప్రజానీకం వ్యాక్సిన్ తీసుకునేందుకు ఎలా ముందుకు వస్తుందని ప్రశ్నిస్తున్నారు. ప్రజల్లో ధైర్యం నింపాల్సిన అధికారులే ఈ నటిస్తారా? అని మండిపడుతున్నారు. వ్యాక్సిన్ వేయించుకోకుండా నటించిన అధికారులను వెంటనే డిస్మిస్ చేయాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో వచ్చిన విమర్శలపై డాక్టర్ నాగేంద్రప్ప స్పందించారు.
తాము టీకా తీసుకోకుండా నటించామన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదన్నారు. తాను ఎటువంటి తప్పుచేయలేదని పేర్కొన్నారు. వ్యాక్సినేషన్ ప్రారంభమైన తొలి రోజే అంటే జనవరి 16నే తాను భారత్ బయోటెక్ కొవాగ్జిన్ టీకా తీసుకున్నానని వెల్లడించారు. డాక్టర్ రజనీ టీకా తీసుకోకుండా నటించారనేది అబద్దమని తుమకూరు డిప్యూటీ కమిషనర్ రాకేశ్ కుమార్ తెలిపారు. డాక్టర్ రజినీ కూడా తొలి రోజు అంటే జనవరి 16నే వ్యాక్సినేషన్ తీసుకున్నారని వెల్లడించారు. అయితే ఆమె వ్యాక్సినేషన్ తీసుకున్న ఫోటోలు మీడియాకు రాలేదని.. ఫోటోలకు ఫోజులివ్వడమే ఆమె చేసిన తప్పని రాకేశ్ వెల్లడించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout