బాలకృష్ణ 105వ సినిమా వివరాలు
Send us your feedback to audioarticles@vaarta.com
బాలకృష్ణ 105వ సినిమాకు సంబంధించిన అధికారిక సమాచారం వెలువడింది. శతాధిక చిత్రాల కథానాయకుడు నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రముఖ దర్శకుడు కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో ఓ సినిమా ప్రారంభం కానుంది.
ప్రముఖ నిర్మాత, సి.కె.ఎంటర్టైన్మెంట్స్ అధినేత సి.కల్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. 'జైసింహా' వంటి సూపర్ డూపర్ హిట్ తర్వాత ఈ హిట్ కాంబినేషన్లో రూపొందనున్న చిత్రమిది. ఈ చిత్రంలో విలక్షణ నటుడు జగపతిబాబు విలన్గా నటించబోతున్నారు. బ్లాక్బస్టర్ 'లెజెండ్' తర్వాత బాలకృష్ణ, జగపతిబాబు కాంబినేషన్లో ఈ చిత్రం రూపొందనుంది. ప్రముఖ సంగీత దర్శకుడు చిరంతన్ భట్ సంగీత సారథ్యం వహిస్తున్నారు.
ఈ హిట్ కాంబోలో సినిమా మే 17న లాంఛనంగా ప్రారంభం అవుతుంది. జూన్ నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. సినిమాకు సంబంధించిన మిగతా నటీనటులు, టెక్నీషియన్స్ వివరాలను త్వరలో ప్రకటిస్తామని నిర్మాత సి.కల్యాణ్ తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com