సమంతపై అభ్యంతరకర పోస్ట్.. పూజా హెగ్దే అకౌంట్ హ్యాక్!
- IndiaGlitz, [Thursday,May 28 2020]
ఇదేంటి.. టాలీవుడ్ టాప్ హీరోయిన్ పూజా హెగ్దే.. సమంతపై అభ్యంతర పోస్ట్ చేసిందా..? అని ఆశ్చర్యపోతున్నారా..? అవును పోస్ట్ చేసిన విషయం వాస్తవమే కానీ చేసింది మాత్రం పూజా హెగ్దే కాదట. ఎవరో ఆమె ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ చేసి ఆ పోస్ట్ చేశారట. ఈ విషయం పసిగట్టిన పూజా తన అకౌంట్‌ను ఎవరో హ్యాక్ చేశారని తన డిజిటల్ టీమ్‌కు చెప్పడంతో అసలు విషయం బయటపడింది. అనంతరం తన ట్విట్టర్ ఖాతా ద్వారా అభిమానులు, సినీ ప్రియులతో పూజా ఈ విషయం పంచుకుంది. అంతేకాదు.. ఇకపై తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుంచి వచ్చే ఇన్విటేషన్స్‌ను ఎవరూ పట్టించుకోవద్దని.. అలాగే ఎలాంటి వ్యక్తిగత సమాచారాన్ని ఆ అకౌంటుతో షేర్ చేసుకోవద్దని తన తోటి మిత్రులకు, నటీనటులకు పూజా ట్విట్టర్ ద్వారా సూచించింది.
నా అకౌంట్ చేతల్లోకి..
ఇదిలా ఉంటే.. ఇన్స్టాగ్రామ్ అకౌంట్‌ను డిజిటల్ టీమ్ సరిచేసింది. తన అకౌంట్ సెట్ అయ్యిందని చెబుతూ పూజ మరో ట్వీట్ కూడా చేసింది. ఈ సందర్భంగా డిజిటల్ టీమ్‌కు కృతజ్ఞతలు కూడా తెలిపింది. ‘ఎట్టకేలకు నా అకౌంట్ చేతుల్లోకి తిరిగి వచ్చింది. ఇన్‌స్టాలో హ్యాక్ అయినప్పుడు హ్యాకర్లు చేసిన పోస్ట్‌లను మా డిజిటల్ టీమ్ తొలగించింది’ అని కూడా ట్విట్టర్లో పూజా హెగ్దే రాసుకొచ్చింది. కాగా.. నటీనటుల అకౌంట్స్ హ్యాక్ అవ్వడం కొత్తేమీ కాదు. ఇప్పటికే హ్యాకర్లు భారిన పడ్డ అకౌంట్లు కోకొల్లలే ఉన్నాయి.