నాగ్ హాథీరామ్ బాబాకు అడ్డంకులు..

  • IndiaGlitz, [Wednesday,June 29 2016]

కింగ్ నాగార్జున - ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావు కాంబినేష‌న్లో రూపొందుతున్న చిత్రం ఓం న‌మో వెంక‌టేశాయ‌. ఈ చిత్రాన్ని శిరిడి సాయి చిత్ర నిర్మాత మ‌హేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈనెల 25న ముహుర్తం షాట్ తో ప్రారంభించిన ఈ చిత్రం రెగ్యుల‌ర్ షూటింగ్ ను జులై 2 నుంచి స్టార్ట్ చేయ‌డానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే... ప్ర‌జెంట్ సినిమా టైటిల్ విష‌యంలోనో...క‌థ విష‌యంలోనో వివాదస్ప‌దం అవ్వ‌డం కామ‌న్ అయిపోయింది. ఇలా వివాద‌స్ప‌దం అవ్వ‌డం క‌మ‌ర్షియ‌ల్ సినిమాల విష‌యంలోనే కాదు...భ‌క్తిర‌స చిత్రాల‌కు కూడా ఏదో ర‌కంగా అడ్డంకులు ఎదుర‌వుతున్నాయి.
ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే...ఓం న‌మో వెంక‌టేశాయ చిత్రం పై హాథీరామ్ మ‌ఠం నిర్వాహుకులు అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తున్నారు. త‌మ‌ను సంప్ర‌దించ‌కుండా...త‌మ‌కు ఎలాంటి స‌మాచారం ఇవ్వ‌కుండా ఎలా సినిమా తీస్తారంటూ ప్ర‌శ్నిస్తున్నారు. సినిమాలో అభ్యంత‌ర‌క‌ర స‌న్నివేశాలు ఉంటే స‌మ‌స్య‌లు త‌ప్ప‌వు అంటూ హెచ్చ‌రిస్తున్నారు. అయితే...ఈ చిత్ర ద‌ర్శ‌కుడు రాఘ‌వేంద్ర‌రావు టి.టి.డి బోర్డ్ స‌భ్యుడు కాబ‌ట్టి ఈ వివాదం పెద్ద స‌మ‌స్యే కాదు. త్వ‌ర‌లోనే హాథీరామ్ బాబా మ‌ఠం వాళ్ల‌ను ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావు సంప్ర‌దించినున్న‌ట్టు స‌మాచారం. జులై 2 నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభించే ఓం న‌మో వెంక‌టేశాయ చిత్రాన్ని సంక్రాంతి కానుక‌గా రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

More News

జూలై1న రావాల్సిన 'మేము' జులై 8న వస్తోంది!!

సూపర్ స్టార్ సూర్య-అమలాపాల్-బిందుమాధవి ముఖ్య తారాగణంగా..

విశాల్ ట్వీట్ - శరత్ కుమార్ కు హార్ట్ ఎటాక్...

ఓ వైపు హీరోగా సక్సెస్ సాధిస్తూ...మరో వైపు నడిగర సంఘంలోను సక్సెస్ సాధించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకున్నహీరో విశాల్. హీరోగా, నడిగర సంఘం నాయకుడుగా వార్తల్లో నిలుస్తున్న విశాల్..

తమిళ రీమేక్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన చైతు..

అక్కినేని నాగచైతన్య నటించిన సాహసం శ్వాసగా సాగిపో,ప్రేమమ్ చిత్రాలు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి.

ఖైదీగా చిరు నెంబర్ నాడు 786..నేడు..?

మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.

101వ చిత్రాన్ని ప్రకటించిన బాలయ్య.....

నందమూరి నటసింహం బాలకృష్ణ 100వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రంలో నటిస్తున్నారు.