Railway Station:రైల్వే ఫ్లాట్ ఫాం టీవీల్లో పోర్న్ వీడియోలు.. ఖంగుతిన్న ప్రయాణికులు, 3 నిమిషాల పాటు స్ట్రీమింగ్
Send us your feedback to audioarticles@vaarta.com
సాధారణంగా రైల్వేస్టేషన్‌లలో అనౌన్స్‌మెంట్‌లు వచ్చే టీవీలు వుంటాయి. వాటిల్లో రైలు వచ్చే వివరాలతో పాటు కొన్ని వాణిజ్య ప్రకటలు వస్తూ వుంటాయి. ఫ్లాట్‌ఫాంల మీద లక్షలాది మంది ప్రయాణికుల చూపు ఆ టీవీల మీదే వుంటుంది. అలాంటిది ఆ టీవీలలో పోర్న్ వీడియోలు ప్రసారమైతే. ఆదివారం బీహార్ రాజధాని పాట్నా రైల్వేస్టేషన్‌లో వున్న టీవీల్లో ఒక్కసారిగా వీడియోలు ప్రసారం కావడంతో ప్రయాణీకులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. దీంతో అధికారులపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంట్రాక్ట్ సంస్థపై అధికారుల చర్యలు :
రంగంలోకి దిగిన రైల్వే పోలీసులు, అధికారులు అక్కడ ప్రసారాల కాంట్రాక్ట్ దక్కించుకున్న దత్తా కమ్యూనికేషన్స్‌పై చర్యలు ప్రారంభించారు. కాంట్రాక్ట్ రద్దు చేయడంతో పాటు జరిమానా విధించారు. సదరు వీడియోలు ఫ్లాట్‌ఫాం 10పై వున్న టీవీల్లోనే ప్రసారం అయినట్లు అధికారులు గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న జీఆర్‌పీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
గతంలో తిరుమలలోనే ఇదే తరహా ఘటన :
ఇదిలావుండగా కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుడు కొలువైయున్న తిరుమలలోనూ ఇలాంటి ఘటన జరగడం అప్పట్లో కలకలం రేపింది. 2020 నవంబర్‌లో శ్రీవెంకటేశ్వర భక్తి ఛానెల్‌లో ప్రసారమయ్యే శతమానం భవతి కార్యక్రమానికి సంబంధించి ఓ భక్తుడు మెయిల్ పంపాడు. దీనికి ఎస్వీబీసీ ఉద్యోగి ఒకరు పోర్న్‌సైట్ లింక్‌ను రిప్లయ్‌గా పెట్టాడు. దానిని చూసిన సదరు భక్తులు అవాక్కయ్యాడు. దీనిపై టీటీడీ ఛైర్మన్, ఈవోలకు ఫిర్యాదు చేశారు. దీనిపై రంగంలోకి దిగిన టీటీడీ విజిలెన్స్ అధికారులు.. ఎస్వీబీసీ ఆఫీసులో పోర్న్‌సైట్ చూస్తున్న ఐదుగురు ఉద్యోగులను అరెస్ట్ చేసింది. వీరంతా విధులు నిర్వర్తించకుండా కార్యాలయంలో పోర్న్ వీడియోలు చూస్తున్నట్లు అధికారులు తేల్చారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments