మార్చి 11న విడుదలవుతున్న 'ఓ స్త్రీ రేపు రా'
Send us your feedback to audioarticles@vaarta.com
రీడింగ్ లాంప్ క్రియేషన్స్ బ్యానర్‌పై ఆశిష్ గాంధీ, వంశీకష్ణ కొండూరి, కునాల్ కౌశిక్, దీక్షాపంత్, శృతి మోల్, మనాలి రాథోడ్ హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం 'ఓ స్త్రీ రేపు రా'. 'కల్పితమా..కచ్చితమా' అనేది ఉపశీర్షిక. అశోక్ రెడ్డి దర్శక నిర్మాత. ఈ సినిమాను మార్చి 11న విడుదల చేస్తున్నారు.
ఈ సందర్భంగా...
దర్శక నిర్మాత అశోక్‌రెడ్డి మాట్లాడుతూ ''ఒకప్పుడు ఊళ్ళో దెయ్యం తిరుగుతుందని, ఇంటి గోడలపై ఓ స్త్రీ రేపు రా అని రాసుకునేవారు. కొన్నిచోట్లయితే భయంతో చాలా మంది వారు ఉంటున్న గ్రామాలను విడిచి పెట్టి వెళ్ళిపోయారు. ఈ హర్రర్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌ను సినిమాటిక్‌గా, డిఫరెంట్‌గా ఉండాలని కో ప్రొడ్యూసర్ ప్రవీణ్ సపోర్ట్‌తో 'ఓ స్త్రీ రేపు రా' చిత్రాన్ని రూపొందించాం. 'కల్పితమా..కచ్చితమా' ఉపశీర్షిక. టీమంతా చాలా ఇష్టపడి, కష్టపడి చేసిన సినిమా. ఘంటశాల విశ్వనాథ్ సంగీతం అందించిన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే ప్రమోషనల్ సాంగ్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మ్యూజిక్‌తో పాటు సినిమాలో రీరికార్డింగ్ హైలైట్ కానుంది. అన్నీ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సినిమాను మార్చి 11న విడుదల చేస్తున్నాం'' అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com