'ఓ స్త్రీ రేపు రా' ఆడియో విడుదల

  • IndiaGlitz, [Friday,November 20 2015]

రీడింగ్ లాంప్ క్రియేషన్స్ పతాకంపై అశోక్ రెడ్డి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం 'ఓ స్త్రీ రేపు రా'. 'కల్పితమా.. ఖచ్చితమా..' అనేది ఉపశీర్షిక. ఆశిష్ గాంధీ, వంశీకృష్ణ, కునాల్ కౌశిక్, దీక్షా పంత్, శ్రుతి మోల్, మనాలి రాథోడ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఘంటశాల విశ్వనాథ్(జివి) సంగీతమందించారు. గురువారం హైదరాబాద్ లో ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. తమ్మారెడ్డి భరద్వాజ, మధుర శ్రీధర్ పాటల సీడీలను ఆవిష్కరించారు.

తమ్మారెడ్డి మాట్లాడుతూ.. "బాహుబలి, శ్రీమంతుడు, రాజుగారి గది.. ఇలా మంచి చిత్రాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. ప్రస్తుతం హారర్ సినిమాల ట్రెండ్ నడుస్తుంది. మంచి విజయాలు సాధిస్తున్నాయి. అదే తరహాలో ఈ చిత్రం కూడా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను. చిత్ర బృందానికి నా శుభాకాంక్షలు" అన్నారు.

మధుర శ్రీధర్ మాట్లాడుతూ.. "పాటలు, ప్రచార చిత్రాలు బాగున్నాయి. ఈ చిత్రం కోసం అశోక్ రెడ్డి ఎంత కష్టపడ్డాడో తెలుసు. ఇటీవల విడుదలయిన 'రాజుగారి గది' తరహాలో ఈ చిత్రం కూడా పెద్ద విజయం సాధించి దర్శక, నిర్మాతకు లాభాలు తీసుకురావాలి" అన్నారు.

అశోక్ రెడ్డి మాట్లాడుతూ.. "గతంలో కొన్ని గ్రామాలలో తమ ఊళ్లో దెయ్యం తిరుగుతుందనే భయంతో ఇంటి గోడలపై 'ఓ స్త్రీ రేపు రా' అని రాశారు. కొందరయితే గ్రామాలకు గ్రామాలు ఖాళీ చేసి వెళ్లారు. ఆ ఘటనల స్ఫూర్తితో హారర్ థ్రిల్లర్ నేపథ్యంలో ఓ లఘు చిత్రం తీయడానికి సన్నాహాలు చేశాను. మా సహా నిర్మాత ప్రవీణ్ మద్దతుతో చిత్రంగా తీశాం. చిత్ర బృందమంతా కష్టపడి, ఇష్టపడి చేసిన చిత్రమిది. జివి మంచి సంగీతం అందించారు. సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్ సభ్యులు మంచి చిత్రం తీశారంటూ ప్రశంసించారు. మాకు మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. డిసెంబర్ రెండవ వారం లేదా మూడో వారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం" అన్నారు

సంగీత దర్శకుడు జివి మాట్లాడుతూ.. "పాటలన్నీ బాగా కుదిరాయి. సుభాష్ నారాయణ, పవన్ రాచేపల్లి మంచి సాహిత్యం అందించారు. నేపథ్య సంగీతం కూడా బాగుంటుంది. నాకు అవకాశం ఇచ్చిన అశోక్ రెడ్డికి థాంక్స్" అన్నారు.

ఈ కార్యక్రమంలో రాజ్ కందుకూరి తదితరులతో పాటు చిత్ర బృందం పాల్గొన్నారు.

More News

నానితో సినిమా ప్లాన్ చేస్తున్న మెగా నిర్మాత

యువ హీరో నాని భలే భలే మగాడివోయ్ మూవీతో సూపర్ హిట్ సాధించిన విషయం తెలిసిందే.ప్రస్తుతం నాని హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నారు.

సెన్సార్ పూర్తి చేసుకున్న 'సైజ్ జీరో'

ప్రముఖ నిర్మాణ సంస్థ పివిపి బ్యానర్ఫై అనుష్క,ఆర్య ప్రధానపాత్రలో నటించిన చిత్రం'సైజ్ జీరో'.ఈ చిత్రం క్యారెక్టర్ అనుష్క 20 కిలోల బరువు పెరగడం అనుష్కకు సినిమాల పట్ట ఉన్నకమిట్ మెంట్ ను తెలియజేసింది.

హరీష్ శంకర్ అలా ఫిక్స్ అయ్యాడు..

షాక్ సినిమాతో దర్శకుడిగా పరిచయమై..మిరపకాయ్ సినిమాతో సక్సెస్ సాధించిన డైరెక్టర్ హరీష్ శంకర్.ఆతర్వాత గబ్బర్ సింగ్ తో సెన్సేషనల్ హిట్ సాధించి ఇండస్ట్రీ ద్రుష్టిని ఆకర్షించిన హరీష్ శంకర్ రామయ్యా వస్తావయ్యా ఫ్లాప్ అవ్వడంతో వెనకబడిపోయాడు.

మరో ప్రయత్నం చేస్తున్న గౌతమ్..

బ్రహ్మానందం తనయుడు గౌతమ్ పల్లకిలో పెళ్లి కూతురు సినిమాతో హీరోగా పరిచయం అయిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో గౌతమ్ నటుడుగా మంచి మార్కులు సంపాదించినా.. ఆశించిన స్ధాయిలో కమర్షియల్ సక్సెస్ సాధించలేక పోయాడు.

డిసెంబర్ 13న ఒంగోలులో 'సౌఖ్యం' ఆడియో విడుదల

సౌఖ్యం అనే మాటను వింటుంటే మనసుకు సుఖంగా ఉంటుంది.అహర్నిశలూ వ్యక్తి పాటుపడేది సౌఖ్యంగా జీవించడానికే.కుటుంబం సౌఖ్యంగా ఉండాలి.