మార్చి 6న 'ఓ పిట్ట కథ'
Send us your feedback to audioarticles@vaarta.com
అగ్ర నిర్మాణ సంస్థ భవ్య క్రియేషన్స్ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం `ఓ పిట్ట కథ`. ఈ చిత్రానికి చెందు ముద్దు దర్శకుడు. వి.ఆనందప్రసాద్ నిర్మాత. విశ్వంత్ దుద్దుంపూడి, సంజయ్రావు హీరోలుగా, నిత్యాశెట్టి హీరోయిన్‌గా నటించారు. చిత్రీకరణ పూర్తయింది. ఈ సినిమా మార్చి 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల రిలీజైన టీజర్ కి అద్భుత స్పందనవచ్చింది. ``ఏమై పోతానే.. మనసిక ఆగేలా లేదే`` అంటూ సాగే మెలోడీ పాటను
`బుట్టబొమ్మ` పూజా హెగ్డే చేతులమీదుగా వేలెంటైన్స్ డే రోజున విడుదల చేయగా ఫీల్ గుడ్సాంగ్ అన్న ప్రశంసలు దక్కాయి.
ఈ సాంగ్ చిత్రీకరణలో ఓ ఆసక్తి కర సంగతిని నిర్మాత ఆనంద ప్రసాద్ వెల్లడించారు. ఆనంద్ ప్రసాద్ మాట్లాడుతూ-``ఈ పాటను అమలాపురం, కాకినాడ పరిసరాల్లో చిత్రీకరించాం. పాట చిత్రీకరణలో ఓ తమాషా ఉంది. మూవీలో సన్నివేశం మూడ్ కి తగ్గట్టుగా అక్కడ లొకేషన్లలో విజువల్స్ ని తెరకెక్కించాం. తొలుత విజువల్స్ షూట్ చేశాకే హైదరాబాద్ లో ట్యూన్ కట్టాం. ఇలా ఇంతకుముందు ప్రముఖ దర్శకుడు వంశీ
`లేడీస్టైలర్` కోసం ''ఎక్కడ ఎక్కడ దాక్కున్నావే '' పాటలో ప్రయోగం చేశారు. విజువల్స్ షూట్ చేసాక ఇళయరాజాతో ఆ బాణీని సిద్ధం చేయించారు వంశీ గారు. ఆ తరహాలోనే మేం చేసిన ప్రయోగం
అందరినీ ఆకట్టుకుంటుందని భావిస్తున్నాం. మార్చి 6న సినిమాని రిలీజ్ చేస్తున్నాం`` అని తెలిపారు.
దర్శకుడు చెందు ముద్దు మాట్లాడుతూ.. ``ఒక విలేజ్‌లో జరిగే కథ ఇది. ప్రతి సన్నివేశం కడుపుబ్బ నవ్విస్తూనే.. ఏం జరుగుతోందో అనే ఉత్కంఠను కలిగిస్తుంది. పతాకసన్నివేశాల వరకూ అదే థ్రిల్ కొనసాగుతుంది. ట్విస్టులు థ్రిల్ కలిగిస్తాయి. స్క్రీన్ ప్లే ప్రధానంగా తెరకెక్కించాం`` అని అన్నారు.
నటీనటులు: విశ్వంత్ దుద్దుంపూడి, సంజయ్‌రావు, నిత్యాశెట్టి, బ్రహ్మాజీ, బాలరాజు, శ్రీనివాస్ భోగిరెడ్డి, భద్రాజీ, రమణ చల్కపల్లి, సిరిశ్రీ, సూర్య ఆకొండి తదితరులు..
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments