క్రేజీ డైరెక్టర్ పూరి ఆవిష్కరించిన 'ఓ పిల్లా నీవల్లా' మోషన్ పోస్టర్

  • IndiaGlitz, [Monday,January 30 2017]

కిషోర్ స్వీయ‌ద‌ర్శ‌క‌త్వంలో .. కృష్ణ‌చైత‌న్య‌, రాజేష్ రాథోడ్‌, మోనికా సింగ్, షాలు చారసియా న‌టీన‌టులుగా బిగ్ విగ్ మూవీ ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై నిర్మిస్తున్న‌ చిత్రం 'ఓ పిల్లా నీ వ‌ల్లా'. ఫిబ్ర‌వ‌రిలో ఆడియో, మార్చిలో సినిమా రిలీజ్‌కి స‌న్నాహాలు చేస్తున్నారు. క్రేజీ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ ఈ సినిమా మోష‌న్ పోస్ట‌ర్‌ని లాంచ్ చేశారు. 'ఓ పిల్లా నీ వ‌ల్లా' పోస్ట‌ర్ క్యూరియ‌స్‌గా ఉంద‌ని పూరి ప్ర‌శంసించారు.
ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌క నిర్మాత కిషోర్ మాట్లాడుతూ - ''ఓ పిల్లా నీ వ‌ల్లా.. చ‌క్క‌ని ల‌వ్‌, కామెడీ -యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌. అన్ని ఎలిమెంట్స్ ఉన్న చిత్ర‌మిది. మ‌ధు పొన్నాస్ సంగీతం, షోయ‌బ్ అహ్మ‌ద్ సినిమాటోగ్రఫీ సినిమాకు పెద్ద అస్సెట్ అవుతాయి. ఫిబ్ర‌వ‌రి ఆడియో విడుద‌ల చేసి, మార్చిలో సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తాం. పూరి చేతుల‌మీదుగా మోష‌న్‌పోస్ట‌ర్‌ లాంచ్ చేయ‌డం, ఆయ‌న ప్ర‌శంసించ‌డం.. సంతోషాన్నిచ్చింది. పూరి స‌ర్‌కి ధ‌న్య‌వాదాలు'' అన్నారు.
కృష్ణ‌చైత‌న్య‌, రాజేష్ రాథోడ్‌, మోనికా సింగ్, షాలు చారసియా, సూర్య శ్రీనివాస్ త‌దిత‌రులు న‌టించిన ఈ చిత్రానికి సాహిత్యంః కృష్ణ మ‌దినేని, క‌రుణాక‌ర్ అడిగ‌ర్ల‌, కోరియేగ్రాఫర్ :జీతెంద్ర యాక్ష‌న్ః మార్ష‌ల్ ర‌మ‌ణ‌, సినిమాటోగ్ర‌ఫీః షోయబ్ అహ్మ‌ద్ కె.ఎం., ఎడిట‌ర్ః అనిల్ కింతాడ సహా నిర్మాత : మౌర్యా సంగీతంః మ‌ధు పొన్నాస్‌, నిర్మాతః కిషోర్‌, క‌థ‌, స్క్రీన్‌ప్లే, మాట‌లు, ద‌ర్శ‌క‌త్వంః కిషోర్‌.

More News

అందరి ఆశీస్సుల తో గుంటూరోడు గొప్ప విజయం సాధించాలి - మోహన్ బాబు

రాకింగ్ స్టార్ మంచు మనోజ్ &బ్యూటిఫుల్ ప్రగ్యా జైస్వాల్ జంటగా S.K.సత్య తెరకెక్కించిన లవ్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గుంటూరోడు.

అమ్మే నా కూతురు అయ్యింది - నాగార్జున

అక్కినేని నాగ చైతన్య - సమంత గత కొన్ని రోజులుగా ప్రేమించుకుంటున్న విషయం తెలిసిందే.

ఎన్టీఆర్ హీరోయిన్స్ ఫిక్స్ అయ్యారు....

జనతాగ్యారేజ్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా బాబీ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నందమూరి కల్యాణ్ రామ్ నిర్మాతగా

న్యూయార్క్ లో గ్రాఫిక్ వర్క్ జరుపుకుంటున్న 'రాక్షసి'

'కాలింగ్ బెల్ ' చిత్రంతో అందరి ప్రశంసలు అందుకున్న దర్శకుడు పన్నా రాయల్ ఆ చిత్రానికి సీక్వెల్ గా రూపొందిస్తున్న

కల్యాణ్ రామ్ తో రోహిత్ డైరెక్టర్...

ఇజమ్ తర్వాత హీరో కల్యాణ్ రామ్ నటించే మూవీకి సన్నాహాలు చేసుకుంటున్నాడు.