'ఓ మనిషి నీవు ఎవరు..?' మూవీ షూటింగ్ ప్రారంభం
Send us your feedback to audioarticles@vaarta.com
స్వర్ణ క్రియేషన్స్ పతాకంపై రిజ్వాన్ కలసిన్ ప్రధాన పాత్రలో స్వర్ణ కుమారి దొండపాటి నిర్మాతగా కృష్ణ మూర్తి రాజ్ కుమార్ దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం "ఓ మనిషి నీవు ఎవరు..?". ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ లో ప్రారంభం అయింది. ఈ కార్యక్రమానికి హీరో సుమన్ సినీయర్ నటుడు చలపతిరావు ముఖ్యతిధులుగా హాజరయ్యారు. హీరో సుమన్ మొదటి క్లాప్ ఇవ్వగాసినీయర్ నటుడు చలపతిరావు స్విచాన్ చేశారు. ఫస్ట్ షార్ట్ ను కృష్ణ మూర్తి రాజ్ కుమార్ దర్శకత్వం వహించారు.
ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.. ఈ రోజు మా "ఓ మనిషి నీవు ఎవరు..? మూవీ ప్రారంభానికి పెద్ద మనుషుతో మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన సుమన్ గారికి చలపతిరావు గారికి, మీడియా మిత్రులకు మా యునిట్ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ప్రధాన పాత్ర చేస్తున్న రిజ్వాన్ కలసిన్ మాట్లాడుతూ. ఈ చిత్రం లో నటించే అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ స్వర్ణ కుమారిగారికి గోపాలకృష్ణ గారికి రాజ్ కుమార్ గారికి థాంక్యూ షో మచ్ అని కృతజ్ఞతలు తెలుపుకున్నారు
హీరో సుమన్ మాట్లాడుతూ.. ఓ మనిషి నీవు ఎవరు..? ఈ చిత్రం చూడటానికి డేవోషనల్ మూవీ ల కనిపించిన పూర్తి కమర్షియల్ సినిమాలా కథ కధనం నడుస్తుంది. ఈ చిత్రం లో నేను యోహాన్ కేరెక్టర్ చేస్తునందుకు చాలా సంతోషంగా ఉంది అలానే చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు తెలిపారు.
చలపతిరావు మాట్లాడుతూ ఈ చిత్రం లో నేను చైతన్ పాత్ర పోషిస్తున్నాను అన్ని ఏసుబాబు సినిమా లాగా ఈ చిత్రం ఉండదు ఏసుక్రీస్తు సినిమాల్లో ప్రేక్షకులకు తెలియని ఎన్నో విషయాలు ఈ చిత్రంలో ఉంటాయి అని చిత్ర యునిట్ కి శుభాకాంక్షలు తెలిపారు.
ప్రొడ్యూసర్ స్వర్ణ కుమారు దొండపాటి మాట్లాడుతూ ఈ చిత్ర కథని రాజ్ కుమార్ గారు చెప్పినప్పుడు నాకు నచ్చి ఈ చిత్రానికి నేను ప్రొడ్యూసర్ గా చేస్తాను అని చెప్పడం అనుకున్న వెంటనే రాజ్ కుమార్ గారు మిగతా ఫ్రీ ప్రొడక్షన్ పనులు పూర్తిచేసుకుని ఈ రోజు సినిమా ప్రారంభించము ఈ చిత్రం సంక్రాంతి తరువాత విజయవాడలో షూటింగ్ ప్రారంభం కానుంది. అతి త్వరలో పూర్తి చేసుకొని గుడ్ ఫ్రైడే సందర్భంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి వచ్చిన సుమన్ గారికి చలపతిరావు గారికి ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు.
నటీనటులు: రిజ్వాన్ కలసిన్, సుమన్, చలపతిరావు జూ,, రేలంగి, బి. హెచ్. ఇ. ఎల్. ప్రసాద్, జెన్నీటెక్నీషియన్స్: మాటలు: జి. విజయ ,ప్రొడక్షన్ ఎక్సిక్యూటివ్: జె. వి. నారాయణరావు, మేనేజర్: జె. రామారావు ఆర్ట్: సుభాష్, కాస్ట్యూమ్స్:సాధిక్, మేకప్ : భాస్కర్, పి. అర్. ఓ: కడలి రాంబాబు, కో-ప్రొడ్యూసర్ : జె.దుర్గ భవాని , ప్రొడ్యూసర్: స్వర్ణ కుమారి దొండపాటి, కెమెరా.దర్శకత్వం: కృష్ణ మూర్తి రాజ్ కుమార్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com
Comments