మే 13న నైజాంలో విడుదల కానున్న ఓ మల్లి
Send us your feedback to audioarticles@vaarta.com
బి.రమ్యశ్రీ ప్రధాన పాత్రధారిణిగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'ఓ మల్లి'. ఆర్.ఎ.ఎంటర్టైన్మెంట్ పతాకంపై బి.ప్రశాంత్ నిర్మిస్తున్న ఈ చిత్రం మే 13న నైజాంలో విడుదలవుతుంది.
బి.రమ్యశ్రీ మాట్లాడుతూ 'ఓ గ్రామంలోని యువతి జీవితంలో జరిగిన యదార్థ ఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించాం. సినిమా బాగా రావడం కోసం రెండు సంవత్సరాలు పాటు యూనిట్ సభ్యులంతా శ్రమించారు. ఇటీవల నైజాం మినహా మిగతా ప్రాంతాల్లో విడుదలైన ఈ చిత్రం ఆడియెన్స్ నుండే కాకుండా విమర్శకుల నుండి కూడా మంచి స్పందనను రాబట్టుకుంది. ఓ మంచి సినిమా తీశామన్న సంతృప్తి కలిగింది. సునీల్ కశ్యప్ సంగీతమందించిన పాటలకు శ్రోతల నుంచి మంచి స్పందన లభిస్తోంది. కె.దత్తు సినిమాటోగ్రఫీ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. మే 13న సినిమాను నైజాంలో విడుదల చేస్తున్నాం. ఇక్కడి ప్రేక్షకులు కూడా మా చిత్రాన్ని ఆదరించాలని కోరుకుంటున్నాం`` అన్నారు.
ఆకాష్, ఎల్బీ శ్రీరామ్, శ్రీధర్, వేణు, సాయి, జయవాణి, బెనర్జీ తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి ఎడిటర్: వి.నాగిరెడ్డి, సంగీతం: సునీల్ కశ్యప్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com