'నువ్వు తోపురా' ఫస్ట్ లుక్ విడుదల

  • IndiaGlitz, [Friday,June 02 2017]

"లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్" ఫేమ్ సుధాకర్ కొంత విరామం అనంతరం మళ్లీ వెండితెరపై కనువిందు చేసేందుకు సన్నద్ధమవుతున్నాడు. హరనాథ్ బాబు.బి దర్శకత్వంలో యునైటెడ్ ఫిలిమ్స్ పతాకంపై డి.శ్రీకాంత్ నిర్మిస్తున్న ఈ చిత్రం పోస్టర్స్ గత కొన్ని రోజులుగా ప్రేక్షకుల ఆదరణను చూరగొన్నాయి. సుధాకర్ కోమాకుల ఓ వైవిధ్యమైన పాత్ర పోషించనున్న ఈ చిత్రానికి "నువ్వు తోపురా" అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు.సుధాకర్ కోమాకుల సరసన నిత్యా శెట్టి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను నేడు (జూన్ 2) విడుదల చేసారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత డి.శ్రీకాంత్ మాట్లాడుతూ.. "సుధాకర్ కోమాకుల-నిత్యాశెట్టిలు జంటగా రూపొందుతున్న "నువ్వు తోపురా" చిత్రీకరణ 70% అమెరికాలో షూట్ చేసేందుకు ప్లాం చేస్తున్నాం. 30% ఇండియాలో షూట్ చేస్తాం. మొదటి షెడ్యూల్ మే 23న మొదలయింది. తర్వాతి షెడ్యుల్ అమెరికాలో ప్రారంభంకానుంది. హాలీవుడ్ కాన్సెప్ట్ తో రూపొందుతున్న "నువ్వు తోపురా" టీజర్ ను జూన్ 9న విడుదల చేయనున్నాం. అత్యుత్తమ సాంకేతిక నిపుణులతో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని మా దర్శకుడు హరినాధ్ బాబు.బి తెరకెక్కిస్తున్నారు. కృష్ణవంశీ-వైవిఎస్ చౌదరిల వద్ద శిష్యరికం చేసిన ఆయన ఈ చిత్రాన్ని అద్భుతంగా రూపొందిస్తాడన్న నమ్మకం ఉంది" అన్నారు.