నువ్వు నేను ప్రేమ అంటున్న స్టార్ మా !

  • IndiaGlitz, [Monday,May 16 2022]

ఇద్దరు మనుషులు ప్రేమగా ఎదురుపడితే, ఒకరినొకరు ఇష్టపడితే ప్రేమ పుడుతుంది. సాధారణంగా జరిగేది ఇదే. కానీ అస్సలు  ఇష్టపడే ఛాన్స్ లేని అమ్మాయి, ఓ అబ్బాయి మధ్య  ప్రేమ ఎలా పుడుతుంది? ఇదే స్టార్ మా సరికొత్త సీరియల్ కథ. అదే నువ్వు నేను ప్రేమ. ఇద్దరి మధ్య శత్రుత్వం  సంధించే  చాలా కష్టమైన ప్రశ్నలకు  అర్ధవంతమైన సమాధానాలు ఇవ్వబోతోంది -   సీరియల్ నువ్వు నేను ప్రేమ.

జీవితాన్ని ఆస్వాదించాలి అనుకునే అమ్మాయి, జీవితం అంటే డబ్బు సంపాదించడమే అనుకునే అబ్బాయికి మధ్య ఒక బంధం ఏర్పడితే వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది అనేదే సింపుల్ గా సీరియల్ కథ. విభిన్నమైన మనస్తత్వాల మధ్య మొదలయ్యే సంఘర్షణ ఎటు దారితీస్తుందో తెలియని ప్రయాణం చేస్తున్న ఇద్దరి మనుషుల కథ ఇది.

స్టార్ మా లో ఈరోజు సాయంత్రం 06.30 గంటలకు సీరియల్ ప్రారంభం అవుతుంది.ప్రతివారం సోమవారం నుంచి శనివారం వరకు సీరియల్ బ్రాడ్ కాస్ట్ అవుతుంది.

నువ్వు నేను ప్రేమ ప్రోమో కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి.

Content Produced by Indian Clicks, LLC

More News

క్రికెట్ ప్రపంచంలో మరో విషాదం.. రోడ్డు ప్రమాదంలో ఆసీస్ మాజీ క్రికెటర్ ఆండ్రూ సైమండ్స్ దుర్మరణం

రెండు నెలల క్రితం దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ మరణంతో తీవ్ర విషాదంలో మునిగిపోయిన ఆస్ట్రేలియా క్రికెట్‌కు మరో షాక్ తగిలింది.

కోర మీసం, పోలీస్ గెటప్‌లో రామ్ పోతినేని పాన్ ఇండియా రౌడీయిజం .. చితక్కొట్టిన ‘ది వారియర్’ ట్రైలర్

హిట్టు ఫ్లాపులతో సంబంధం లేకుండా నచ్చిన దారిలో సినిమాలు చేసుకుంటే వెళ్లే స్టార్స్‌లో రామ్ పొతినేని కూడా ఒకరు.

నాగచైతన్య - విక్రమ్ కుమార్ ‘‘థాంక్యూ’’ రిలీజ్ డేట్ ఫిక్స్.. పోస్టర్‌లో చైతూ లుక్ వైరల్

ఈ  ఏడాది లవ్‌స్టోరీ సినిమాతో మంచి హిట్ అందుకున్న అక్కినేని నాగచైతన్య తనకు సూటయ్యే కథలతో దూసుకెళ్తున్నారు.

నోటికొచ్చినట్లు హామీలు .. అడిగితే కక్ష సాధింపులు, ఇదీ సీబీఐ దత్తపుత్రుడి తీరు: జగన్‌పై నాదెండ్ల ఫైర్

ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై మండిపడ్డారు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్.

హైదరాబాద్‌లో ఇకపై 24 గంటలూ సిటీ బస్సులు.. ఏయే రూట్లలో అంటే..?

హైదరాబాదీలకు టీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్ చెప్పింది. ఇకపై నగరంలో 24 గంటలూ సిటీ బస్సులు నడుస్తాయని వెల్లడించింది.