"నువ్వు నేను ప్రేమ" అంటున్న స్టార్ మా !
Send us your feedback to audioarticles@vaarta.com
ఇద్దరు మనుషులు ప్రేమగా ఎదురుపడితే, ఒకరినొకరు ఇష్టపడితే ప్రేమ పుడుతుంది. సాధారణంగా జరిగేది ఇదే. కానీ అస్సలు ఇష్టపడే ఛాన్స్ లేని ఓ అమ్మాయి, ఓ అబ్బాయి మధ్య ప్రేమ ఎలా పుడుతుంది? ఇదే స్టార్ మా సరికొత్త సీరియల్ కథ. అదే "నువ్వు నేను ప్రేమ". ఇద్దరి మధ్య శత్రుత్వం సంధించే చాలా కష్టమైన ప్రశ్నలకు అర్ధవంతమైన సమాధానాలు ఇవ్వబోతోంది - ఈ సీరియల్ "నువ్వు నేను ప్రేమ".
జీవితాన్ని ఆస్వాదించాలి అనుకునే అమ్మాయి, జీవితం అంటే డబ్బు సంపాదించడమే అనుకునే అబ్బాయికి మధ్య ఒక బంధం ఏర్పడితే వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది అనేదే సింపుల్ గా ఈ సీరియల్ కథ. విభిన్నమైన మనస్తత్వాల మధ్య మొదలయ్యే సంఘర్షణ ఎటు దారితీస్తుందో తెలియని ప్రయాణం చేస్తున్న ఇద్దరి మనుషుల కథ ఇది.
స్టార్ మా లో ఈరోజు సాయంత్రం 06.30 గంటలకు ఈ సీరియల్ ప్రారంభం అవుతుంది.ప్రతివారం సోమవారం నుంచి శనివారం వరకు ఈ సీరియల్ బ్రాడ్ కాస్ట్ అవుతుంది.
"నువ్వు నేను ప్రేమ" ప్రోమో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Content Produced by Indian Clicks, LLC
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout