'నువ్వు-నేను' హీరోయిన్‌కి అబ్బాయి
Send us your feedback to audioarticles@vaarta.com
'నువ్వు నేను' హీరోయిన్ అనిత హస్సనందనీ రెడ్డి ఇంట వారసుడు వచ్చాడు. దాంతో ఆమె భర్త రోహిత్ రెడ్డి, ఫ్యామిలీ ఫుల్ హ్యాపీగా వున్నారు. మంగళవారం రాత్రి పండంటి అబ్బాయికి అనిత జన్మనిచ్చారు. ఆమె భర్త రోహిత్ రెడ్డి సోషల్ మీడియాలో ఈ న్యూస్ షేర్ చేశారు. భార్యకు ముద్దుపెడుతున్న ఫొటో పోస్ట్ చేసిన రోహిత్, 'ఓ బాయ్' అని కన్ఫర్మ్ చేశాడు.
గోవాకు చెందిన కార్పొరేట్ ప్రొఫెషనల్ రోహిత్ రెడ్డి, అనిత అక్టోబర్ 14, 2013లో పెళ్లి చేసుకున్నారు. పెళ్లైన ఏడేళ్ళకు తొలి సంతానం కలిగింది. యాక్టింగ్ తో అనిత బిజీగా ఉండటంతో తల్లి కావడానికి టైమ్ తీసుకున్నారని చెప్పవచ్చు. కరోనా బ్రేక్ లో ప్లాన్ చేశారనీ అనుకోవచ్చు. లాస్ట్ ఇయర్ అక్టోబర్ 10న భర్తతో కలిసి ఉన్న వీడియో పోస్ట్ చేసిన అనిత, ప్రెగ్నెంట్ అని అనౌన్స్ చేశారు.
'నువ్వు నేను' హిట్ తరువాత తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ లాంగ్వేజెస్ లో అనిత సినిమాలు చేశారు. అలాగని, సినిమాలు రావడానికి కారణమైన సీరియల్స్ ను వదిలిపెట్టలేదు. రెండు కంటిన్యూ చేశారు. ప్రజెంట్ సినిమాల కంటే ఎక్కువగా సీరియల్స్ చేస్తున్నారు. నాలుగేళ్ళ క్రితం ఆర్పీ పట్నాయట్ 'మనలో ఒకడు' ఆమె చేసిన లాస్ట్ సినిమా.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com