Sai Kiran : సభ్యత్వం పేరిట రూ.లక్షలు మోసం .. నిర్మాతపై ఫిర్యాదు చేసిన నువ్వేకావాలి సాయికిరణ్
Send us your feedback to audioarticles@vaarta.com
నువ్వేకావాలి సినిమాలో తరుణ్, రిచాలతో పాటు సమానంగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు, సింగర్ సాయి కిరణ్‌ను ఇద్దరు వ్యక్తులు మోసం చేశారు. మన్న మినిస్ట్రీస్‌లో సభ్యత్వం పేరుతో రూ.10.6 లక్షలు తీసుకుని తనను మోసం చేశారంటూ నిర్మాత జాన్ బాబు, లివింగ్‌స్టెన్‌లపై సాయికిరణ్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. జాన్ బాబు, లివింగ్ స్టెన్‌లపై 420, 406 సెక్షన్స్ కింద కేసులు నమోదు చేశారు.
సంగీత విద్వాంసుల కుటుంబం నుంచి ఇండస్ట్రీలోకి:
సంగీత విద్వాంసుల కుటుంబం నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన సాయి కిరణ్.. లెజెండరీ సింగర్ పి. సుశీల మనువడు. ఆయన తల్లిదండ్రులు కూడా సంగీతంలో విధ్వాంసులే. అయితే సింగర్స్ ఫ్యామిలీ నుంచి వచ్చి నటుడు అయ్యారు సాయి కిరణ్.
సినిమాల్లో రాని గుర్తింపు సీరియల్స్‌తో:
ఇకపోతే.. సాయి కిరణ్ దాదాపు పాతికకు పైగా సినిమాల్లో నటించారు. నువ్వే కావాలి, ప్రేమించు, దేవి, మనసుంటే చాలు వంటి చిత్రాలతో మెప్పించిన సాయి కిరణ్ ప్రస్తుతం సీరియల్స్‌లో బిజీగా ఉన్నారు. కోయిలమ్మ సీరియల్‌తో పాపులర్ అయిన సాయి కిరణ్.. ప్రస్తుతం ‘గుప్పెడంత మనసు’ సీరియల్‌లో హీరోకి తండ్రిగా తెలుగు వారిని అలరిస్తున్నారు. కేవలం తెలుగులోనే కాకుండా మలయాళంలోనూ వరుస సీరియల్స్ చేస్తూ బిజీగా మారిపోయారు. వాస్తవానికి సినిమాల ద్వారా లభించని గుర్తింపు సీరియల్స్‌తో సంపాదించుకున్నాడు సాయి కిరణ్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com