మీకు మాత్రమే చెప్తా "నువ్వే హీరో" ప్రోమోషనల్ మ్యూజిక్ వీడియో సాంగ్ రిలీజ్

  • IndiaGlitz, [Friday,October 25 2019]

విజయ్ దేవరకొండ ప్రొడక్షన్ హౌస్ కింగ్ ఆఫ్ ద హిల్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై రూపొందిన సినిమా మీకు మాత్రమే చెప్తా . ఈ మూవీ మ్యూజిక్ వీడియో నువ్వే హీరో సాంగ్ లాంచ్ విజయ్ ఫాన్స్ చేతుల మీదుగా జరిగింది. ఫ్యాన్స్ ని ఫ్యామిలీ గా ట్రీట్ చేసే హీరో విజయ్ దేవరకొండ తాను ప్రొడ్యూస్ చేస్తున్న మొదటి మూవీ మ్యూజిక్ వీడియా నువ్వే హీరో ని ఫాన్స్ తో లంచ్ చేయించారు. ఎ ఎమ్ బి మాల్ లో జరిగిన ఈ ఈవెంట్ విజయ్ ఫాన్స్ సందడి చేశారు. రెండు వందల మంది విజయ్ దేవరకొండ ఫాన్స్ ప్రత్యేక అతిధులు గా మరిన ఈ మ్యూజిక్ వీడియో లంచ్ లో నవాబ్ రాప్ గ్యాంగ్ పాడిన పాట హైలెట్ గా మారింది. వారితో కలిసి విజయ్ స్టెప్స్ వేశారు.

ఈ సందర్భంగా విజయదేవరకొండ* మాట్లాడుతూ :

ఈ ప్రోమోషనల్ల్ సాంగ్ కోసం నేను చాలా కష్ట పడ్డాను.మా కొరియోగ్రాఫర్ విజయ్ నాకంటే ఎక్కువ శ్రమ తీసుకున్నాడు. తరుణ్, అభినవ్ గోమటం కూడా నాతో స్టెప్స్ వేయాలి కానీ కొన్ని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ తో కుదరలేదు. ఈ మూవీ ఆడియో రైట్స్ తీసుకున్న ఆదిత్య మ్యూజిక్ కి పెద్ద థాంక్స్ ..ఉమేష్ గుప్త గారు ఈ ఈవెంట్ కి వచ్చినందుకు థాంక్స్. కొత్త వారు ఐయినా ప్రయత్నానికి ఉమేష్ గారు అందించిన సహకారం మర్చిపోలేను. శివ మంచి మ్యూజిక్ అందించాడు. తరుణ్ యాక్టింగ్ మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. అభినవ్ బాగా ఎంటర్టైన్ చేసాడు. నవంబర్ 1 న విడుదల అవుతుంది. మీకు బాగా నచ్చుతుంది అని నమ్ముతున్నాను అన్నారు.

ఆదిత్య మ్యూజిక్ ఉమేష్ గుప్తా మాట్లాడుతూ :

గీతా గోవిందం, టాక్సీవాలా ఆడియో ఆదిత్య ద్వారా రిలీజ్ చేసాము. మీకు మాత్రమే చెప్తా ఆడియో ని మాపై నమ్మకం తో ఇచ్చిన ప్రొడ్యూసర్ వర్ధన్ దేవరకొండ గారికి థాంక్స్. విజయ్ ప్రొడ్యూసర్ గా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను.

దర్శకుడు షమ్మీర్ సుల్తాన్ మాట్లాడుతూ :

ఈ పాయింట్ అందరికీ కనెక్ట్ అవుతుంది అని నమ్ముతున్నాను. తరుణ్ బాగా యాక్ట్ చేసాడు, మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. మంచి ఎంటర్టైనర్ తో నవంబర్ 1న మీ ముందుకు వస్తున్నాం అన్నారు.

తరుణ్ భాస్కర్, అభినవ్ గోమటం ఫన్నీ మూమెంట్స్ షేర్ చేసుకున్నారు అన్నారు.

More News

రెండు రాష్ట్రాల్లో గెలిచినా.. బీజేపీకి తప్పని తిప్పలు!

మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు రివర్స్ అయిన సంగతి తెలిసిందే. రెండు రాష్ట్రాల్లోనూ తిరిగి అధికార పీఠాన్ని కైవసం చేసుకోవడానికి కమలం

ఇండిపెండెట్‌ను ఓడించలేకపోయిన టీడీపీ, బీజేపీ!

తెలంగాణలోని హుజూర్‌నగర్‌లో జరిగిన ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి కలలో కూడా ఊహించని భారీ మెజార్టీతో గెలుపొందిన సంగతి తెలిసిందే. సమీప కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతిపై 43,284 వేలకు పైచిలుకు

కేసులే కేసులు.. ‘బండ్ల’ భవిష్యత్ ఏంటో!?

ఎటు చూసినా కేసులే.. పొద్దున నిద్రలేచింది మొదలుకుని నిద్రపోయే వరకూ అన్నీ వివాదాలే.. మీడియా ముందుకొచ్చినా.. ఇంటర్వ్యూకు వెళ్లినా రచ్చరచ్చే.. ఏం చెప్పాలనుకుని వస్తాడో తీరా ఏం మాట్లాడతాడో..

ఏపీలో ఏమవుతుందో దేవుడికే తెలియాలి.. నేనూ చూస్తా!

ఏపీలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే సరిగ్గా ఏపీలో జగన్ ఈ నిర్ణయం తీసుకున్న

‘బిత్తిరి సత్తి’ లైఫ్‌లో జరిగిన బాధాకరమైన విషయాలివీ!

బిత్తిరి సత్తి.. ఈ పేరు తెలియని వారు దాదాపు తెలుగు రాష్ట్రాల్లో ఎవరూ ఉండరు. కాస్త టీవీ చూసే అలవాటు ఉంటే ఇక కొత్త పరిచయం చేయనక్కర్లేదు. ఇతని ఒరిజనల్ పేరు రవికుమార్.