'నువ్వే కావాలి' కి 15 ఏళ్లు

  • IndiaGlitz, [Tuesday,October 13 2015]

చిన్న సినిమాగా విడుద‌లై సంచ‌ల‌న విజ‌యం సాధించిన చిత్రాల్లో 'నువ్వే కావాలి' ది ప్ర‌త్యేక స్థానం. అప్ప‌టివ‌ర‌కు బాల‌న‌టుడుగానే ప‌రిచ‌య‌మున్న‌ త‌రుణ్ ఈ సినిమాతోనే క‌థానాయ‌కుడుగా తొలి అడుగులు వేశాడు. రిచా హీరోయిన్‌గా న‌టించిన తొలి చిత్ర‌మూ ఇదే. మ‌ల‌యాళంలో విజ‌యం సాధించిన 'నిర‌మ్' (షాలిని హీరోయిన్‌)కి తెలుగు వెర్ష‌న్ అయిన ఈ సినిమాని ఉషాకిర‌ణ్ మూవీస్ నిర్మించ‌గా.. కె.విజ‌య్ భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. నేటి ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ సంభాష‌ణ‌లు అందించారు.

కోటి సంగీతంలోని పాట‌ల‌న్నీ అప్ప‌ట్లో సంచ‌ల‌నం సృష్టించాయి. 'అన‌గ‌న‌గా ఆకాశం ఉంది', 'ఎక్క‌డ ఉన్నా ప‌క్క‌న నువ్వే ఉన్న‌ట్టుంట్టుంది', 'క‌ళ్ళ‌ల్లోకి క‌ళ్లు పెట్టి చూడ‌వెందుకు' పాట‌లు ఇప్ప‌టికీ ఎక్క‌డో చోట వినిపిస్తూనే ఉంటాయి. 2000కి ఉత్త‌మ ప్రాంతీయ చిత్రంగా జాతీయ పుర‌స్కారాన్ని పొంద‌డంతో పాటు 5 ఫిల్మ్ ఫేర్ అవార్డుల‌ను సొంతం చేసుకున్న 'నువ్వే కావాలి' నేటి (అక్టోబ‌ర్ 13)తో 15 సంవ‌త్స‌రాల‌ను పూర్తిచేసుకుంటోంది.

More News

ఆ వార్త లో వాస్తవం లేదంటున్న ఎన్టీఆర్..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం నాన్నకు ప్రేమతో సినిమా చేస్తున్నారు.సుకుమార్ తెరకెక్కిస్తున్న నాన్నకు ప్రేమతో..చిత్రాన్ని సంక్రాంతికి కానుక గా జనవరి 8న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే.

3 రోజుల్లో..టాప్ 3 ప్లేస్ లో 'రుద్రమదేవి'

అగ్ర కధానాయిక అనుష్క టైటిల్ రోల్ లో గుణ టీమ్ వర్క్స్ బ్యానర్ పై గుణ శేఖర్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన భారతదేశపు తొలి హిస్టారికల్ స్టీరియో స్కోపిక్ 3డి మూవీ రుద్రమదేవి.

చరణ్ దగ్గర డబ్బులు లేవట...

మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ దగ్గర డబ్బులు లేకపోవడం ఏమిటి..? ఇదేదో కామెడీ అనుకుంటే పొరపాటే.ఈ విషయాన్ని చెప్పింది ఎవరో కాదు..

బ్రూస్ లీ సెంటిమెంట్ ఫాలో కాలేదా...?

రామ్ చరణ్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందిన చిత్రం బ్రూస్ లీ.సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న బ్రూస్ లీ ఈనెల 16న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది.

బ్రూస్ లీ టైటిల్ అందుకే పెట్టారా..?

రామ్ చరణ్,శ్రీను వైట్ల కాంబినేషన్ లో రూపొందిన క్రేజీ మూవీ బ్రూస్ లీ.ఈ సినిమాలో చరణ్ స్టంట్ మేన్ గా నటించారు.