శిరోముండనం కేసులో నూతన్ నాయుడు అరెస్ట్.. షాకింగ్ న్యూస్ చెప్పిన సీపీ
Send us your feedback to audioarticles@vaarta.com
విశాఖ శిరోముండనం కేసులో సినీ నిర్మాత, బిగ్‌బాస్ ఫేం నూతన్‌నాయుడని పోలీసులు అరెస్ట్ చేశారు. నూతన్‌నాయుడిని ఉడిపిలో అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చామని సీపీ మనీష్ కుమార్ సిన్హా వెల్లడించారు. శిరోముండనం ఘటనలో నూతన్‌నాయుడు ప్రమేయం ఉందన్నారు. ఇప్పటికే నూతన్‌నాయుడు భార్య ప్రియా మాధురిని అరెస్ట్ చేశామన్నారు. ప్రియా మాధురి సహా ఏడుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపామని సీపీ వెల్లడించారు.
ఘటన జరిగిన రోజు 6 సెల్‌ఫోన్లను సీజ్ చేశామని సీపీ మనీష్ కుమార్ సిన్హా తెలిపారు. నూతన్‌నాయుడు భార్య సమక్షంలోనే దళిత యువకుడికి శిరోముండనం జరిగిందని వెల్లడించారు.
సీసీ టీవీ ఫుటేజీతో పాటు కీలక ఆధారాలు సేకరించామన్నారు. అయితే నూతన్ నాయుడుకి సంబంధించి ఓ షాకింగ్ విషయాన్ని సీపీ మీడియాకు వెల్లడించారు. మాజీ ఐఏఎస్ పీవీ రమేష్ పేరుతో నూతన్‌నాయుడు.. సుధాకర్ అనే డాక్టర్‌కు ఫేక్ కాల్స్ చేశాడని సీపీ వెల్లడించారు. ఫేక్ కాల్స్ వచ్చినట్లు డా.సుధాకర్.. పీవీ రమేష్‌కు తెలిపారని పేర్కొన్నారు. విషయం తెలిసిన వెంటనే పీవీ రమేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారని సీపీ వెల్లడించారు. కేసు దర్యాప్తు చేయగా నిందితుడు నూతన్‌నాయుడని తేలిందన్నారు. ఆ ఫోన్ నెంబర్‌తో పలు కాల్స్ చేసినట్లు గుర్తించామన్నారు. దర్యాప్తులో మరిన్ని వివరాలు బయటకొస్తాయని సీపీ మనీష్‌కుమార్ సిన్హా వెల్లడించారు.
కాగా.. సినీ నిర్మాత నూతన్‌కుమార్ నాయుడు తనకు శిరోముండనం చేయించారంటూ శ్రీకాంత్ అనే యువకుడు వీడియో విడుదల చేసిన విషయం తెలిసిందే. విశాఖ నగర పరిధిలోని సుజాతానగర్‌లో ఉన్న సినీ నిర్మాత నూతన్‌కుమార్‌నాయుడు ఇంట్లో శుక్రవారం కర్రి శ్రీకాంత్ అనే యువకుడికి శిరోముండనం చేయించాడు. బాధితుడు కర్రి శ్రీకాంత్(20) ఈ విషయాన్ని ఓ వీడియో సందేశం ద్వారా వెల్లడించాడు. తనను దారుణంగా కొట్టారని పేర్కొన్నాడు. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు సీసీ టీవీ ఫుటేజి ఆధారంగా విచారణ నిర్వహించారు. శ్రీకాంత్‌ని దారుణంగా కొట్టి, హింసించి శిరోముండనం చేయించిన దృశ్యాలు బయటకు రావడంతో దళిత సంఘాలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com