సెల్‌ఫోన్ తీశాడనే నెపంతో యువకుడికి శిరోముండనం చేయించిన నూతన్ నాయుడు
Send us your feedback to audioarticles@vaarta.com
సినీ నిర్మాత నూతన్‌కుమార్ నాయుడు తనకు శిరోముండనం చేయించారంటూ ఓ యువకుడు వీడియో విడుదల చేసి కలకలం సృష్టించాడు. విశాఖ నగర పరిధిలోని సుజాతానగర్‌లో ఉన్న సినీ నిర్మాత నూతన్‌కుమార్‌నాయుడు ఇంట్లో శుక్రవారం కర్రి శ్రీకాంత్ అనే యువకుడికి శిరోముండనం చేయించారు . బాధితుడు కర్రి శ్రీకాంత్(20) ఈ విషయాన్ని ఓ వీడియో సందేశం ద్వారా వెల్లడించాడు. తనను దారుణంగా కొట్టారని పేర్కొన్నాడు.
‘నేను నూతన్ నాయుడు సర్ ఇంట్లో 4 నెలలపాటు పని చేశాను. ఆగస్ట్ 1న జీతం తీసుకుని మానేశా. నిన్న రాత్రి ఫోన్ చేసి రమ్మన్నారు. వెళ్తే ఫోన్ పోయిందన్నారు. నువ్వే ఫోన్ తీసుకున్నావని నింద మోపారు. మళ్లీ సూపర్‌వైజర్ ఫోన్ చేస్తే వెళ్లాను. ఫోన్ నువ్వే తీశావని గట్టిగా ప్రశ్నించారు. నేను తీయలేదు.. తీయనప్పుడు ఎక్కడి నుంచి తీసుకురానని అడిగాను. వాళ్లు నాపై రివర్స్ అయిపోయి కొట్టారు. మా వాట్సాప్ హ్యాక్ చేశావని.. సైబర్ క్రైంలో కంప్లైంట్ ఇచ్చామని చెప్పారు. బ్యూటీషియన్ ఇందిరను తీసుకొచ్చారు. సెల్‌ఫోన్ హ్యాక్ చేసి అసభ్యంగా ప్రవర్తించావంటూ నన్ను కొట్టారు. తర్వాత మంగళోడి దగ్గరకు తీసుకెళ్లి గుండు కొట్టించారు. ఎంత వద్దని కాళ్లు పట్టుకున్నా వదలకుండా రక్తం వచ్చేలా కొట్టారు’’ అని శ్రీకాంత్ వెల్లడించాడు.
ఘటన జరిగిన సమయంలో నూతన్ భార్య అక్కడే ఉన్నారని బాధితుడు తెలిపాడు. శిరోముండనం ఘటనపై శ్రీకాంత్ పెందుర్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా, నూతన్‌కుమార్ 2014లో అసెంబ్లీ ఎన్నికల్లో ‘జై సమైక్యాంధ్ర పార్టీ’ తరఫున పెందుర్తి నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. బిగ్‌బాస్ షోలో పాల్గొన్నారు. ప్రస్తుతం సినీ, రాజకీయ రంగాల్లో కొనసాగుతున్నారు. ప్రస్తుతం దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై ‘పరాన్నజీవి’ అనే చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments