షాకిస్తున్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య.. కాస్త ఊరటనిచ్చే అంశమిదే..
- IndiaGlitz, [Saturday,June 20 2020]
జనాభాలో ప్రపంచంలోనే రెండో పెద్ద దేశం మనది. ఇన్ని కోట్ల మందిలో పదుల సంఖ్యలో పాజిటివ్ కేసులు పెద్ద లెక్కేం కాదులే అని మొదట్లో ప్రజానీకం ప్రదర్శించిన నిర్లక్ష్యం ఇప్పుడు తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది. రోజురోజుకూ దేశ వ్యాప్తంగా ఊహించని రీతిలో కరోనా కేసులు పెరుగుతుండటం యావత్ భారతాన్ని వణికిస్తోంది. ప్రస్తుతం దేశంలో కరోనా పాజిటివ్‌ల సంఖ్య దాదాపు నాలుగు లక్షలకు చేరుకోవడం కలవరపాటుకు గురిచేస్తోంది.
గడిచిన 24 గంటల్లో 14,516 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశ వ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 3 లక్షల 95వేల 48కి చేరుకుంది. గడిచిన 24 గంటల్లో మరణాల సంఖ్య 375 ఉండగా.. ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా కరోనా కారణంగా 12వేల 948 మంది మృతి చెందారు. కాగా ఇప్పటి వరకూ కరోనా నుంచి 2లక్షల 13 వేల 831 మంది కోలుకోగా.. ఒక లక్షా 68వేల 269 యాక్టివ్ కేసులున్నాయి. కాగా.. యాక్టివ్ కేసుల కంటే కోలుకున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండటం కాస్త ఊరటనిచ్చే అంశం.