నుమాయిష్‌పై కోవిడ్ ఎఫెక్ట్.. ఈ ఏడాది కూడా పూర్తిగా రద్దు, నాంపల్లి సొసైటీ కీలక ప్రకటన
Send us your feedback to audioarticles@vaarta.com
దేశంలో కరోనా , ఒమిక్రాన్ కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో దీని ప్రభావం అన్ని రంగాలపై పడుతోంది. కేసుల దృష్ట్యా జనం భారీగా గుమిగూడే ప్రదేశాలు, షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఈ నేపథ్యంలో కరోనా ప్రభావం హైదరాబాద్‌లోని ప్రఖ్యాత నుమాయిష్‌పై పడింది. కోవిడ్ కారణంగా అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శనను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ఎగ్జిబిషన్ సొసైటీ గురువారం ప్రకటించింది.
ఈ నెల 1వ తేదీన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నుమాయిష్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం దేశం, రాష్ట్రంలో కొవిడ్ మహమ్మారి విజృంభిస్తోన్న నేపథ్యంలో ఈ ఏడాది నుమాయిష్‌ను రద్దు చేయాలని హైదరాబాద్ పోలీసులు ఎగ్జిబిషన్ సొసైటీకి నోటీసులు ఇచ్చింది. సీపీ ఆదేశాల మేరకు ఇప్పటికే నుమాయిష్‌లోకి ప్రజల సందర్శనను నిర్వాహకులు నిలిపివేశారు. అయితే పరిస్ధితి అదుపు తప్పేలా వుండటంతో నుమాయిష్‌ను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు సొసైటీ ప్రకటించింది. అయితే గతేడాది కూడా నాంపల్లి ఎగ్జిబిషన్‌ను కరోనా నిబంధనలతో పూర్తిగా మూసివేసిన విషయం తెలిసిందే.
ప్రతిఏటా జనవరి 1న ప్రారంభమై ఫిబ్రవరి 15.. వరకు 45 రోజుల పాటు సాగుతుంది నుమాయిష్. దేశంలోని అనేక ప్రాంతాల నుంచి వచ్చిన వ్యాపారులు ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేసుకొని తమ వస్తువులను, ఉత్పత్తులను విక్రయిస్తారు. నుమాయిష్‌కు జంట నగరాల నుంచి ప్రతి రోజు 50 వేలమంది వరకు వస్తుంటారు. ఈ క్రమంలో 45 రోజుల్లో దాదాపు 20 లక్షల మంది నుమాయిష్‌ను సందర్శిస్తారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com