Numaish:నుమాయిష్ ఎగ్జిబిషన్ ప్రారంభం.. అప్పటివరకు ట్రాఫిక్ ఆంక్షలు..

  • IndiaGlitz, [Monday,January 01 2024]

హైదరాబాద్‌లో నుమాయిష్ ఎగ్జిబిషన్‌ ప్రారంభమైంది. నగరంలోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో సీఎం రేవంత్ రెడ్డి దీనిని ప్రారంభించారు. జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు 45 రోజుల పాటు ఈ ఎగ్జిబిషన్ జరగనుంది. 80 ఏళ్లుగా తెలంగాణలో జరుగుతున్న నుమాయిష్ ఎగ్జిబిషన్‌కు దేవ్యాప్తంగా వర్తకులు వస్తారు. ఈసారి కూడా దేశం నలుమూలల నుంచి సుమారు 2,400 స్టాల్స్ ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో నుమాయిష్ ప్రెసిడెంట్‌గా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు నియమితులయ్యారు. ఎగ్జిబిషన్‌లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

ఈసారి ఎగ్జిబిషన్ టికెట్ ధర రూ.40గా నిర్ణయించారు. ప్రతి రోజూ సాయంత్రం 3.30 నుంచి రాత్రి 10.30 వరకు ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లోకి సందర్శకులను అనుమతిస్తారు. అయితే ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎగ్జిబిషన్‌ లోపల వాహనాలతో సందర్శించే ఏర్పాట్లు కూడా చేశారు. ఇందుకు ప్రత్యేక రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఎగ్జిబిషన్ నేపథ్యంలో నేటి నుంచి ఫిబ్రవరి 15వ తేదీ వరకు ప్రతి రోజు సాయంత్రం 4 గంటల నుంచి అర్ధరాత్రి వరకు నాంపల్లి పరిసరాలలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర పోలీస్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.

మరోవైపు టీఎస్ ఆర్టీసీ ప్రత్యేకంగా బస్సులు నడపనుంది. అలాగే మెట్రో రైళ్ల సమయాన్ని కూడా పెంచారు. మియాపూర్- ఎల్బీనగర్, నాగోల్ - రాయదుర్గం మార్గాల్లో చివరి మెట్రో రైలు రాత్రి 12.15 గంటలకు మొదలై ఒంటి గంటకు గమ్యస్థానాలకు చేరుకుంటాయి. ఇదిలా ఉంటే ఈసారి దాదాపు 22 లక్షల మంది ఎగ్జిబిషన్‌ను సందర్శిస్తారని నిర్వాహకులు అంచనా వేస్తారు. ఎగ్జిబిషన్‌కు వచ్చే సందర్శకులను గోషామహల్, అజంతా గేట్, గాంధీభవన్ గేట్ల వద్ద మెటల్ డిటెక్టర్లతో తనిఖీ చేసి లోపలికి అనుమతిస్తారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే సందర్శకుల కోసం వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడా పోటీలు నిర్వహించనున్నారు.

More News

Rajasingh: బిర్యానీ బాలేదన్నందుకు కస్టమర్స్‌ను చావబాదారు.. రాజాసింగ్ ఆగ్రహం..

బిర్యానీ బాగలేనందుకు హైదరాబాద్‌లోని ఓ హోటల్ సిబ్బంది కస్టమర్లపై వీరంగం సృష్టించారు. చేతికి అందిన కర్రలు, కుర్చీలతో దాడి చేశారు. ఈ దాడిలో కొంతమంది కస్టమర్లకు తీవ్ర గాయాలయ్యాయి.

Metro Expansion: తక్కువ ఖర్చుతో మెట్రో విస్తరణ చేపడతాం: సీఎం రేవంత్

న్యూ ఇయర్ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై క్లారిటీ ఇచ్చారు.

షర్మిల వస్తే సీఎం జగన్ ఎందుకు భయపడతారు.. ఈ చిన్న లాజిక్ ఎలా మిస్సయ్యారు..?

ఆడలేక మద్దెల దరువు అన్నట్లు తయారైంది టీడీపీ పరిస్థితి. ఎన్నికల్లో సీఎం జగన్‌తో ఒంటరిగా పోరాడే సత్తా లేని పార్టీ కూడా అవాకులు చవాకులు పేలుతుంది. తన అనుకూల యెల్లో మీడియా ద్వారా సత్యదూరమైన

Earthquake in Japan: జపాన్‌ను వణికిస్తున్న వరుస భూకంపాలు.. సునామీ హెచ్చరికలు..

కొత్త సంవత్సరం జపాన్‌(Japan)కు భీకరమైన జ్ఞాపకాన్ని తీసుకొచ్చింది. వరుస భూకంపాల(Earthquake)తో ఆ దేశం ఉలిక్కిపడింది. 90 నిమిషాల వ్యవధిలో 21 భూకంపాలు సంభవించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

Sharmila son: కుమారుడు పెళ్లి తేదిని ప్రకటించిన వైయస్ షర్మిల.. వధువు ఎవరంటే..?

తెలుగు రాష్ట్రాల ప్రజలు, వైఎస్సార్ అభిమానులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు తన కుటుంబానికి సంబంధించిన కీలక విషయాన్ని వైసీటీపీ అధినేత్రి వైయస్ షర్మిల వెల్లడించారు.