Numaish 2023 : హైదరాబాదీలకు షాక్.. నుమాయిష్ ఎంట్రీ టికెట్ ధర పెంపు , ఎంతో తెలుసా..?
Send us your feedback to audioarticles@vaarta.com
భాగ్యనగర వాసులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ (నుమాయిష్) కు మరోసారి ముహూర్తం సిద్ధమైంది. కరోనా వైరస్, లాక్డౌన్, ప్రమాదాల కారణంగా ఏర్పడిన అవాంతరాలతో నుమాయిష్ ప్రదర్శన సరిగా సాగలేదు. అయితే ఈసారి మాత్రం ఎగ్జిబిషన్‌ను నగర వాసులు పూర్తిగా ఆస్వాదించడానికి సిద్ధమవుతున్నారు. 2023 జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు 45 రోజుల పాటు నుమాయిష్ జరగనుంది. దీనికి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
మూడేళ్లుగా ఎగ్జిబిషన్ సొసైటీకి నష్టాలు:
అయితే ఈసారి నుమాయిష్‌ను సందర్శించాలంటే జేబుకు చిల్లు పడాల్సిందే. గత మూడేళ్లుగా ఏఐఐఈకి వస్తున్న నష్టాల వల్ల ఎగ్జిబిషన్ సొసైటీ కీలక నిర్ణయాలు తీసుకుంది. దీనిలో భాగంగా ఎంట్రీ ఫీజును పెంచాలని నిర్ణయం తీసుకుంది. దీంతో ఇప్పటి వరకు రూ.30గా వున్న టికెట్ ధర.. రూ.40 కానుంది. అలాగే ఎగ్జిబిషన్ టైమింగ్స్‌లోనూ మార్పులు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
నుమాయిష్ టైమింగ్స్‌లోనూ మార్పులు:
గతంలో నుమాయిష్ సాధారణ రోజుల్లో మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 10.30 వరకు వుండేది. అదే వీకెండ్లో అయితే మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు వుండేది. అయితే వారాంతాల్లోనే ఎక్కువగా సందర్శకులు వుస్తుండటంతో రాత్రి 12 గంటల వరకు సమయం పెంచాలని నిర్వాహకులు భావిస్తున్నారట. దీనిపై జీహెచ్ఎంసీ, పోలీస్ శాఖతో చర్చలు జరుగుతున్నాయి . ఇక పార్కింగ్ రుసుము విషయంలో మాత్రం ఎలాంటి మార్పులు తీసుకోలేదు. ఫోర్ వీలర్స్‌కు రూ.50, టూవీలర్స్‌కు రూ.20 వసూలు చేయనున్నారు.
నుమాయిష్‌కు 85 ఏళ్ల చరిత్ర:
కాగా... హైదరాబాద్ నగరానికే తలమానికంగా నిలిచే నుమాయిష్‌కు 85 ఏళ్ల చరిత్ర వుంది. తొలుత నిజాం హయాంలో 1938 ఏప్రిల్ 6న పబ్లిక్ గార్డెన్స్‌లో ఏర్పాటైన నుమాయిష్ తర్వాత దేశంలోనే అతిపెద్ద ఎగ్జిబిషన్‌గా మారింది. అప్పట్లో 80 స్టాల్స్‌తో, రూ.2.5 లక్షల ఖర్చుతో ప్రారంభమైన నుమాయిష్.. నేడు 3500 పైగా స్టాల్స్‌తో, వందల కోట్ల వ్యాపారం సాగించే ఓ వేదికగా మారి వేలాది మందికి ఉపాధి కల్పిస్తోంది. రూ.10 నుంచి లక్షల రూపాయల విలువైన వస్తువులు ఇక్కడ దొరుకుతాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout