Mothers Day:సెలబ్రిటీలు, వారి మాతృమూర్తులతో ‘‘అమ్మకు ప్రేమతో.. కమ్మని వంట’’.. NTV Entertainmentలో
Send us your feedback to audioarticles@vaarta.com
భగవంతుడు సృష్టించిన వాటిలో అమ్మను మించిన అపురూపం లేదు. దేవుడు అన్ని చోట్లా వుండలేక అమ్మను సృష్టించాడని మన పెద్దలు అంటూ వుంటారు. అమ్మ ప్రేమ ఈ ప్రపంచాన్నే మరిపింపజేస్తుంది. అమ్మను మించిన దైవం వుండదంటారు. అమ్మ అంటే ఓ అనుభూతి.. ఓ అనుబంధం.. ఓ అప్యాయత, ఓ ఆత్మీయత. జన్మనివ్వడమే కాకుండా పిల్లలను ప్రయోజకులుగా తీర్చిదిద్ది దేశానికి అందించే మాతృమూర్తిని గౌరవించడం ప్రతి ఒక్కరి కర్తవ్యం.
అనంతమైన ప్రేమను తన బిడ్డలకు పంచే ప్రతి మాతృమూర్తికి మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ.. అంతులేని అనురాగాల్ని , అద్భుతమైన స్నేహాన్ని, అలుపెరుగని ఓర్పుని పంచె అమ్మ గొప్పతనానికి ప్రతీకగా ఎన్టీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ‘‘అమ్మకు ప్రేమతో’’ … కమ్మని వంట కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మనల్ని నిత్యం అలరించే అభిమాన నటీ, నటులు వారి తల్లితో ఉన్న అనుబంధాన్ని, ఆప్యాయతని, వారి జీవితంలో ఎదుర్కొన్న ఒడిదుడుకుల్ని, జయాపజయాలని తెలియజేయడంతో పాటు ‘‘ అమ్మకు ప్రేమతో’’ కమ్మని వంటను స్వయంగా వండి తినిపిస్తూ ప్రేమను కురిపించే కార్యక్రమమే ‘‘ఈ అమ్మకు ప్రేమతో.. కమ్మని వంట’’.
ఈ కార్యక్రమాన్ని తెనాలి డబుల్ హార్స్ సమర్పిస్తోంది. పరంపర రెస్టారెంట్, ఓరిల్, టీ టైమ్, ఓయాసిస్ ఫెర్టిలిటీ, శ్వేత తెలుగు ఫుడ్స్, లగ్జరియో బోటిక్‌లు స్పాన్సర్స్‌గా, పార్టనర్స్‌గా వ్యవహరిస్తున్నాయి. ఈ కార్యక్రమానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే తెలియజేయనుంది ఎన్టీవీ ఎంటర్‌టైన్‌మెంట్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments