Mothers Day:సెలబ్రిటీలు, వారి మాతృమూర్తులతో ‘‘అమ్మకు ప్రేమతో.. కమ్మని వంట’’.. NTV Entertainmentలో

  • IndiaGlitz, [Monday,May 08 2023]

భగవంతుడు సృష్టించిన వాటిలో అమ్మను మించిన అపురూపం లేదు. దేవుడు అన్ని చోట్లా వుండలేక అమ్మను సృష్టించాడని మన పెద్దలు అంటూ వుంటారు. అమ్మ ప్రేమ ఈ ప్రపంచాన్నే మరిపింపజేస్తుంది. అమ్మను మించిన దైవం వుండదంటారు. అమ్మ అంటే ఓ అనుభూతి.. ఓ అనుబంధం.. ఓ అప్యాయత, ఓ ఆత్మీయత. జన్మనివ్వడమే కాకుండా పిల్లలను ప్రయోజకులుగా తీర్చిదిద్ది దేశానికి అందించే మాతృమూర్తిని గౌరవించడం ప్రతి ఒక్కరి కర్తవ్యం.

అనంతమైన ప్రేమను తన బిడ్డలకు పంచే ప్రతి మాతృమూర్తికి మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ.. అంతులేని అనురాగాల్ని , అద్భుతమైన స్నేహాన్ని, అలుపెరుగని ఓర్పుని పంచె అమ్మ గొప్పతనానికి ప్రతీకగా ఎన్టీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ‘‘అమ్మకు ప్రేమతో’’ … కమ్మని వంట కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మనల్ని నిత్యం అలరించే అభిమాన నటీ, నటులు వారి తల్లితో ఉన్న అనుబంధాన్ని, ఆప్యాయతని, వారి జీవితంలో ఎదుర్కొన్న ఒడిదుడుకుల్ని, జయాపజయాలని తెలియజేయడంతో పాటు ‘‘ అమ్మకు ప్రేమతో’’ కమ్మని వంటను స్వయంగా వండి తినిపిస్తూ ప్రేమను కురిపించే కార్యక్రమమే ‘‘ఈ అమ్మకు ప్రేమతో.. కమ్మని వంట’’.

ఈ కార్యక్రమాన్ని తెనాలి డబుల్ హార్స్ సమర్పిస్తోంది. పరంపర రెస్టారెంట్, ఓరిల్, టీ టైమ్, ఓయాసిస్ ఫెర్టిలిటీ, శ్వేత తెలుగు ఫుడ్స్, లగ్జరియో బోటిక్‌లు స్పాన్సర్స్‌గా, పార్టనర్స్‌గా వ్యవహరిస్తున్నాయి. ఈ కార్యక్రమానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే తెలియజేయనుంది ఎన్టీవీ ఎంటర్‌టైన్‌మెంట్.

More News

Weekend Releases: ఈ వారం ఓటీటీ / థియేటర్‌లలో రీలిజయ్యే చిత్రాలివే..

కరోనా తర్వాత వ్యవస్థలో చెప్పలేనన్ని మార్పులు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం కొందరికే పరిమితమని అనుకుంటున్న వేళ ..

KTR: తెలంగాణలో మ్యూజిక్ యూనివర్సిటీ.. కేటీఆర్ ప్రతిపాదన, ఇళయరాజా గ్రీన్ సిగ్నల్

తెలంగాణలో మ్యూజిక్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామన్నారు రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్.

Naga Chaitanya:పరశురామ్‌తో వివాదం .. అతని గురించి మాట్లాడటం 'టైమ్ వేస్ట్' , నాగచైతన్య హాట్ కామెంట్స్

అక్కినేని నాగచైతన్య.. ఏఎన్ఆర్ వంశం నుంచి తెలుగు చిత్ర సీమలో అడుగుపెట్టిన మూడో తరం హీరో.

Navadeep:నా వల్ల ఏ హీరోయిన్ చనిపోలేదు.. నేను గేని కాను, ఆ రేవ్ పార్టీ జరిగినప్పుడు : నవదీప్ సంచలన వ్యాఖ్యలు

సినిమా అంటే రంగుల ప్రపంచం. ఇక్కడ నిలదొక్కుకోవాలంటే గుమ్మడికాయంత టాలెంట్‌తో పాటు ఆవ గింజంత అదృష్టం కూడా వుండాలి.

Maa Oori Polimera 2:'మా ఊరి పొలిమేర‌ -2' పోస్ట‌ర్ లాంచ్ !!

శ్రీకృష్ణ క్రియేష‌న్స్ బేన‌ర్ పై  గౌరు గ‌ణ‌బాబు స‌మ‌ర్ప‌ణ‌లో  గౌరికృష్ణ నిర్మాత‌గా డా.అనిల్ విశ్వ‌నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో