జూనియర్ ఎన్టీఆర్ భావోద్వేగ ట్వీట్

  • IndiaGlitz, [Wednesday,May 20 2020]

యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున విషెస్ చెబుతున్నారు. మరోవైపు అభిమానులు సైతం పెద్ద ఎత్తున పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. ప్రస్తుతం కరోనా కష్టకాలం కావడంతో ఇంటికే పరిమితమైన ఎన్టీఆర్.. కుటుంబ సభ్యులతోనే వేడుకలు జరుపుకున్నాడు. అదే విధంగా అభిమానులంతా ఇంట్లోనే ఉంటే అదే తనకు పెద్ద గిఫ్ట్ అన్నాడు. ఈ నేపథ్యంలో తన అభిమానులకు తారక్ ధన్యవాదాలు తెలిపిన ఆయన ట్విట్టర్ వేదికగా వారిని ఉద్దేశించి భావోద్వేగ ట్వీట్ చేశాడు.

మీ రుణం ఏమిచ్చి తీర్చుకోగలను!?

ప్రియమైన అభిమానులారా.. మీరు నామీద చూపిస్తున్న అభిమానం వెలకట్టలేనిది. అన్నింటా నాకు తోడుగా వస్తున్న మీరే నా బలం. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను? ఏం చేసి ఈ ప్రేమకు అర్హుడిని అవగలను? చివరి దాకా మీకు తోడుగా ఉండటం తప్ప..’ అని ఎన్టీఆర్ భావోద్వేగ ట్వీట్ చేశాడు. అంతేకాదు మరో ట్వీట్‌లో తనకు బర్త్ డే విషెస్ చెప్పిన సహచరులు, సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తులందరికీ తారక్ ధన్యవాదాలు చెబుతున్నానని తారక్ ట్విట్టర్‌లో రాసుకొచ్చాడు. అందరి ట్వీట్లు చదవడం గొప్పగా అనిపించిందని మీరందరూ ఈ రోజును మరింత స్పెషల్‌గా మార్చారని జూనియర్ తన ట్విట్టర్ వేదిగా చెబుతూ తీవ్ర భావోద్వేగాని లోనయ్యాడు. ఎన్టీఆర్ చేసిన ఈ ట్వీట్‌కు అభిమానులు, నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తూ లైక్‌లు, రీట్వీట్‌ల వర్షం కురిపిస్తున్నారు.

More News

ఎన్టీఆర్ బర్త్ డే.. ప్రశాంత్ నీల్ ఇంట్రెస్టింగ్ ట్వీట్

జూనియ‌ర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున విషెస్ చెబుతున్నారు.

కరోనా నుంచి భారత్ కోలుకుంటున్నట్లేనా!?

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి థాటి నుంచి ఇండియా కోలుకుంటుందా..? ఇతర దేశాలతో పోలిస్తే ఇండియా కాసింత మెరుగుపడుతోందా..?

ఏపీలో పలువురు ఐఏఎస్‌లు బదిలీ, పదోన్నతులు

కరోనా కష్టకాలంలోనూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.

ఎన్టీఆర్‌ను పోర్న్‌స్టార్‌తో పోల్చిన ఆర్జీవీ!

టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు. ఎప్పుడు ఎలా మాట్లాడతారో..?

టాలీవుడ్‌కు జగన్ సర్కార్ బిగ్ రిలీఫ్..

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కబలిస్తున్న కష్టకాలంలో యావత్ భారతదేశ వ్యాప్తంగా లాక్ డౌన్ నడుస్తున్న విషయం విదితమే.