జూనియర్ ఎన్టీఆర్ భావోద్వేగ ట్వీట్
Send us your feedback to audioarticles@vaarta.com
యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున విషెస్ చెబుతున్నారు. మరోవైపు అభిమానులు సైతం పెద్ద ఎత్తున పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. ప్రస్తుతం కరోనా కష్టకాలం కావడంతో ఇంటికే పరిమితమైన ఎన్టీఆర్.. కుటుంబ సభ్యులతోనే వేడుకలు జరుపుకున్నాడు. అదే విధంగా అభిమానులంతా ఇంట్లోనే ఉంటే అదే తనకు పెద్ద గిఫ్ట్ అన్నాడు. ఈ నేపథ్యంలో తన అభిమానులకు తారక్ ధన్యవాదాలు తెలిపిన ఆయన ట్విట్టర్ వేదికగా వారిని ఉద్దేశించి భావోద్వేగ ట్వీట్ చేశాడు.
మీ రుణం ఏమిచ్చి తీర్చుకోగలను!?
ప్రియమైన అభిమానులారా.. మీరు నామీద చూపిస్తున్న అభిమానం వెలకట్టలేనిది. అన్నింటా నాకు తోడుగా వస్తున్న మీరే నా బలం. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను? ఏం చేసి ఈ ప్రేమకు అర్హుడిని అవగలను? చివరి దాకా మీకు తోడుగా ఉండటం తప్ప..’ అని ఎన్టీఆర్ భావోద్వేగ ట్వీట్ చేశాడు. అంతేకాదు మరో ట్వీట్లో తనకు బర్త్ డే విషెస్ చెప్పిన సహచరులు, సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తులందరికీ తారక్ ధన్యవాదాలు చెబుతున్నానని తారక్ ట్విట్టర్లో రాసుకొచ్చాడు. అందరి ట్వీట్లు చదవడం గొప్పగా అనిపించిందని మీరందరూ ఈ రోజును మరింత స్పెషల్‌గా మార్చారని జూనియర్ తన ట్విట్టర్ వేదిగా చెబుతూ తీవ్ర భావోద్వేగాని లోనయ్యాడు. ఎన్టీఆర్ చేసిన ఈ ట్వీట్‌కు అభిమానులు, నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తూ లైక్‌లు, రీట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు.
— Jr NTR (@tarak9999) May 18, 2020
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments