ఎన్టీఆర్ బావ మరిది మూవీకి డేట్ ఫిక్స్..!
Send us your feedback to audioarticles@vaarta.com
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యామిలీ నుంచి ఓ హీరో తెలుగు చిత్ర సీమలోకి అడుగు పెడుతున్నారు. అతనెవరో కాదు..ఎన్టీఆర్‌కు స్వయానా బావ మరిది అయిన నార్నె నితిన్ చంద్ర. ఇప్పటి వరకు వ్యాపార రంగం, మీడియా రంగాలకే పరిమితం అయిన నార్నె ఫ్యామిలీ ఇప్పుడు సినీ రంగంలోకి అడుగు పెడుతుందని సమాచారం. ఇప్పటికే నితిన్ చంద్ర నటన, డాన్సులు, యాక్షన్‌కు సంబంధించిన శిక్షణను పూర్తి చేసేసుకున్నాడు. కథ వినేసి ఓకే చేశాడు కూడా. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు దర్శకుడు తేజ రూపొందించనున్న చిత్రం 1.1లో నటించబోతున్నాడు. లేటెస్ట్ సమాచారం మేరకు ఈ సినిమాకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఏప్రిల్ 18న చిత్రం 1.1ను లాంఛనంగా ప్రారంభించబోతున్నారట.
సీత తర్వాత మరో సినిమా ఏదీ చేయని తేజ.. రెండు సినిమాలను అనౌన్స్ చేశాడు. అందులో ఒకటి రానాతో, మరోటి గోపీచంద్‌తో. రీసెంట్‌గానే గోపీచంద్ తాను చేయాలనుకున్న మూవీ నుంచి డ్రాప్ అయ్యాడు. దీంతో తేజ.. చిత్రం 1.1ను ట్రాక్ ఎక్కించేస్తున్నాడు. డైరెక్టర్‌గా తేజకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టిన చిత్రం సీక్వెల్ చిత్రం 1.1 ఎలాంటి సక్సెస్‌ను అందిస్తుందో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com