ఎన్టీఆర్ 30 నుంచి ఆలియా అవుట్... ఛాన్స్ కోసం ఇద్దరు పాన్ ఇండియా హీరోయిన్స్ పోటీ
Send us your feedback to audioarticles@vaarta.com
ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రామ్‌చరణ్‌తో కలిసి ఎన్టీఆర్ నటించిన ఆర్ఆర్ఆర్ మూవీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. వెయ్యి కోట్ల పైచిలుకు వసూళ్లతో భారతీయ సినీ పరిశ్రమలో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సక్సెస్ జోష్‌తో వున్న ఎన్టీఆర్ ఏమాత్రం రెస్ట్ తీసుకోకుండా తన తదుపరి సినిమాలపై దృష్టి సారిస్తున్నారు.
ప్రస్తుతం ఆయన కొరటాల శివ దర్శకత్వంలో తన 30వ సినిమాలో నటించనున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన జనతా గ్యారేజీ ఘన విజయం సాధించింది. ఈ కాంబినేషన్ మళ్లీ రీపిట్ అవుతుండటంతో ఇండస్ట్రీలో మంచి అంచనాలు వున్నాయి. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కనున్న ఈ సినిమాలో హీరోయిన్ ఎవరన్న దానిపై సస్పెన్స్ నెలకొంది. నిన్న మొన్నటి వరకు బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ హీరోయిన్గా చేస్తుందని ప్రచారం జరిగింది. అయితే ఆమె ఇటీవల తన ప్రియుడు రణ్‌బీర్ కపూర్‌ను పెళ్లి చేసుకుని హనీమూన్ మూడ్‌లో వుంది. దీనికి తోడు గతంలో ఒప్పుకున్న పలు ప్రాజెక్టుల వల్ల ఆలియా, ఎన్టీఆర్ 30కి డేట్స్ అడ్జెస్ట్ చేయడం సాధ్యం కాలేదని ఫిలింనగర్ టాక్. దీంతో ఆమె ప్లేస్‌లో మరో హీరోయిన్ను వెతకాల్సిన పరిస్ధితి దాపురించింది.
మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఆచార్య’ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్న కొరటాల శివ తాను త్వరలో తెరకెక్కించనున్న ఎన్టీఆర్ సినిమా గురించి కొన్ని విషయాలు పంచుకున్నారు. ఈ మూవీలో మాస్‌తో పాటు ఎమోషనల్ కంటెంట్ ఎక్కువగా వుంటుందని, హీరోయిన్‌కి కూడా బలమైన పాత్ర వుంటుందని కొరటాల శివ చెప్పారు. అయితే అలియా భట్ తప్పుకోవడంతో రష్మిక, పూజా హేగ్డేలు హీరోయిన్ రేసులో ముందున్నారట. ఎన్టీఆర్ పక్కన నటించేందుకు వీరిద్దరూ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారట. తెలిసిన వారితో లాబీయింగ్ చేస్తున్నారని ఫిలింనగర్ టాక్. పాన్ ఇండియా చిత్రం కావడంతో రష్మిక కెరీర్లో ఇది పెద్ద ప్రాజెక్ట్ కానుంది. గత చిత్రాలు రాధేశ్యామ్, బీస్ట్‌లు అట్టర్‌ఫ్లాప్ కావడంతో పూజా హెగ్డేకు అర్జెంట్‌గా హిట్ అవసరం. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. NTR30లో రష్మిక ఛాన్స్ కొట్టేసే అవకాశాలు ఎక్కువగా వున్నాయి.
ఈ సినిమాకు అనిరుధ్ స్వరాలు సమరూర్చనున్నారు. నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించబోతున్నాయి. మిక్కిలినేని సుధాకర్ ఈ చిత్రంతో నిర్మాతగా మారుతున్నారు. దీని తర్వాత సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో ఓ పాన్ ఇండియన్ సినిమా చేయనున్నారు ఎన్టీఆర్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com