పవన్ డైరెక్టర్ తో ఎన్టీఆర్..!

  • IndiaGlitz, [Wednesday,November 23 2016]

బ్లాక్ బ‌ష్ట‌ర్ మూవీ జ‌న‌తా గ్యారేజ్ త‌ర్వాత యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ చేసే మూవీ ఏమిటి అనే విష‌యం పై ఇంకా క్లారిటి రాలేదు. పూరి జ‌గ‌న్నాథ్, త్రివిక్ర‌మ్ శ్రీనివాస్, అనిల్ ర‌విపూడి, చందు మొండేటి...ఇలా ఎన్టీఆర్ తో మూవీ చేయ‌నున్న డైరెక్ట‌ర్ అంటూ వీరి పేర్లు తెర పైకి వ‌చ్చాయి కానీ...ఏ డైరెక్ట‌ర్ తో ఎన్టీఆర్ మూవీ ఉంటుంది అనేది మాత్రం ఇంకా తెలియ‌లేదు.
తాజాగా ప‌వ‌న్ తో స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ చిత్రాన్ని తెర‌కెక్కించిన బాబీ పేరు తెర పైకి వ‌చ్చింది. ఇటీవ‌ల బాబీ ఎన్టీఆర్ కు క‌థ చెప్ప‌డం...క‌థ విని ఎన్టీఆర్ ఇంప్రెస్ అయ్యార‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది. మ‌రో వైపు సింగం డైరెక్ట‌ర్ హ‌రి కూడా త్వ‌ర‌లో ఎన్టీఆర్ కు క‌థ చెప్ప‌నున్నార‌ని తెలిసింది. బాబీ, హ‌రి ఈ ఇద్ద‌రిలో ఎవ‌రో ఒక‌రి క‌థను ఎన్టీఆర్ ఫైన‌ల్ చేసే అవ‌కాశం ఉన్న‌ట్టు స‌మాచారం. ఎన్టీఆర్ ను డైరెక్ట్ చేసే అవ‌కాశాన్ని బాబీ ద‌క్కించుకుంటే నిజంగా ల‌క్కీయే...!